Share News

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:34 AM

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ఇల్లంతకుంట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులకు సూచించారు. మండలంలోని పొత్తూరు గ్రామసమీపంలోని వంతెన వద్ద ఆదివారం స్థలాన్ని పరిశీలించారు. మానేరు వంతెన పక్కనుంచి మానేరు వాగులో దిగి పుణ్యస్నానాలు చేయడానికి ప్రతిరోజు భక్తులు వస్తున్నందున మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా, మెట్లు నిర్మించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజల సౌలభ్యం కోసం పనులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు ఇరుమల్ల నర్సయ్య, ఒట్టె శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 12:34 AM