Share News

ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లతో ప్రతిపాదనలు

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:17 AM

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్ల ప్రతిపాదనలు పంపించినట్లు ఆలయ ధర్మకర్తల చైర్మన్‌ జక్కు రవీందర్‌ తెలిపారు.

ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లతో ప్రతిపాదనలు
మాట్లాడుతున్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ జక్కు రవీందర్‌

- ధర్మపురి ఆలయ చైర్మన్‌ జక్కు రవీందర్‌

ధర్మపురి, సెప్టెంబరు 19 ( ఆంధ్రజ్యోతి ): ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్ల ప్రతిపాదనలు పంపించినట్లు ఆలయ ధర్మకర్తల చైర్మన్‌ జక్కు రవీందర్‌ తెలిపారు. స్థానిక దేవస్థానం చైర్మన్‌ ఛాంబర్‌లో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. యోగా నరసింహుని ప్రధాన ఆలయం పున:నిర్మాణం కోసం రూ 20 కోట్లు, ఉగ్రనారసింహుని ఆలయ పున:నిర్మాణం కోసం రూ 5.50 కోట్లు, యమధర్మరాజు ఆలయ పునఃనిర్మాణం కోసం రూ. 20 లక్షలు నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. రథశాల నిర్మాణం కోసం రూ. మూడు కోట్లు, కల్యాణ మండపం నిర్మాణం కోసం రూ. ఏడు కోట్లు, కోనేరు రినోవేషన్‌ కోసం రూ. నాలుగు కోట్లు, నూతన హోమశాల నిర్మాణం కోసం రూ. 50 లక్షలతో ప్రతిపాదనుల సిద్ధం చేసి పంపిం చినట్లు చైర్మన్‌ రవీందర్‌ తెలిపారు. దేవస్థానం పక్కనే భూసేకరణ కోసం ప్రతిపాదించిన స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణ అభివృద్ధి పనుల వివరాలను ఆయన వెల్లడించారు. ఇప్పటికే భూసేకర ణ కోసం రూ 20 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపా రు. 2027లో జరిగే గోదావరి పుష్కర స్నానఘట్టాలను అభివృద్ధి కోసం ప్రణాళిక లు రూపొందించనున్నట్టు సమావేశంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, ధర్మకర్తలు రాపర్తి సాయికిరణ్‌, స్తంభంకాడి గణేష్‌, బొల్లారపు పోచయ్య, ఏదులాపురం మహేందర్‌, గుడ్డ రవీందర్‌, నేదునూరి శ్రీధర్‌, ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు నేరెళ్ల శ్రీనివాసచారి పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:17 AM