Share News

భూభారతితో సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:30 AM

ధరణితో ఎదురైన భూ సమస్యలు భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని ముంజంపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు.

భూభారతితో సమస్యలు పరిష్కారం
ముంజంపల్లిలో ఆర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ

మానకొండూర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ధరణితో ఎదురైన భూ సమస్యలు భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని ముంజంపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూభారతితో రైతులకు, భూయజమానులకు మేలు జరుగుతుం దన్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా భూభారతి చట్టం తీసుకొచ్చా మన్నారు. అంతకుముందు మానకొండూర్‌లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 610 మందికి ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మర్రి ఓదెలు, వైస్‌ చైర్మన్‌ రామిడి తిరుమల్‌రెడ్డి, తహశీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో వరలక్ష్మీ, హౌసింగ్‌ ఏఈ దుర్గం మహేశ్‌, నందగిరి రవీంద్రాచారి, తాల్లపల్లి సంపత్‌గౌడ్‌, కొత్తకొండ శంకర్‌, మడుపు ప్రేమ్‌కుమార్‌, కోండ్ర సురేష్‌, తాళ్లపల్లి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:31 AM