స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:49 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బిక్షపతి అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బిక్షపతి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారులో కాస్త జాప్యం జరిగిందన్నారు. ఖరారైన రిజర్వేషన్లను అన్ని పార్టీలు తమ జనాభా ప్రకారం మాకు సీట్లను కేటాయించాలన్నారు. గత ప్రభుత్వంలో మాదిగా సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాం గ్రెస్ ప్రభుత్వం మార్కెట్ కమిటి చైర్మన్‌ల ఎంపికలో మాదిగా సామాజిక వర్గాని కి అన్యాయం చేసిందని ఆరోపించారు. జడ్పిటీసీ ఎన్నికలలో మాదిగల జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ జిల్లాలో రెండు జడ్పీటీసీ బీ ఫాంలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆవునూరి ప్రభాకర్, జిల్లా నాయకులు ఆవునూరి లచ్చన్న, శ్రావణ పెల్లి బాలయ్య, కర్రె శంకరయ్య, మునిగె శంకర్, అక్కనపల్లి పోచమల్లు, బొని గాని కృష్ణ, గజ్జల శశికుమార్, బంటు వంశీకుమార్, మారవేణి దేవరాజు, గండ్రెడ్డి రాజు, శ్రావణపెల్లి రాకేష్, కడకంట్ల రాజయ్య పాల్గొన్నారు.