ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయాలి
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:39 AM
ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయడంతో పాటు ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జూలై 12 (అంధ్రజ్యోతి) : ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయడంతో పాటు ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలో శనివారం టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రామ్‌నాఽఽథ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన 10వేల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్ట్‌లను ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన పదివేల పోస్టులు ఇంతవరకు మంజూరు చేయలేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేసి ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్య బాగుంటేనే విద్యారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాథమిక స్థాయిని నిర్లక్ష్యం చేయడం వలన ప్రభుత్వ విద్యావ్యవస్థ తీవ్రమైన సమస్యలను ఎదుర్కుంటోందన్నారు. అదేవిధంగా బీఎడ్ అర్హత కలిగిన ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు కూడా ప్రాఽథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్ట్‌లు ఇవ్వాలన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలలను మూసివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించడం వల్ల విద్యార్థుల అభ్యసన తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రభుత్వం 20మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా నిబంధనలను సవరించాలన్నారు. ప్రభుత్వం పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, ఉపాధ్యక్షులు మందాడి శ్రీనివాస్‌రెడ్డి, కెవి రజనిరాణి, కార్యదర్శి మైలారం తిరుపతి, చకినాల రమచంద్రం, ఎడ్ల కృష్ణ, చైతన్యరెడ్డి, అకాడమిక్ సెల్ కన్వీనర్ బుస్స రాజేందర్, శ్రీధర్, తాటికోండ సంజీవ్, జగిత్యాల శ్రీనివాస్, కదిరే శ్రీనివాస్, బోజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.