Share News

ఘనంగా ప్రధాన మంత్రి జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:03 AM

ప్రధాని జన్మదిన వేడుకలు బుధవారం వేముల వాడలో నిర్వహించారు.

ఘనంగా ప్రధాన మంత్రి జన్మదిన వేడుకలు

వేములవాడ సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి) : ప్రధాని జన్మదిన వేడుకలు బుధవారం వేముల వాడలో నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నాయ కుడు ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో రాజరాజే శ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ప్రధాని పేరిట కోడె మొక్కు చెల్లించుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్‌, గోపు బాలరా జు, రేగులమల్లికా ర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా, ప్రధాని జన్మదిన వేడుకలను బీజేపీ వే ములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్‌రావు ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించారు. తొలుత తెలంగాణ విమో చన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీ రులకు నివాళులర్పించారు. రక్తదానం చేసిన వా రికి వికాస్‌రావు ప్రశంసాపత్రాలు అందజేశారు. బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి సిరికొండ శ్రీని వాస్‌, వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్‌, నాయకులు అల్లాడి రమేష్‌, ఎర్రం మ హేష్‌, బండ మల్లేశం యాదవ్‌, అన్నపూర్ణ తది తరులు పాల్గొన్నారు.

వేములవాడ కల్చరల్‌: వేములవాడ మం డలంలో వేడుకలు నిర్వహించారు. అర్బన్‌ మం డల బీజేపీ అధ్యక్షుడు బుర్ర శేఖర్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో రక్తదానం చేశారు. అగ్రహారం శ్రీజోడాం జనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఎర్రం మహేష్‌, చింతపల్లి వెంకటేశ్వర్‌రావు, గుండెకార్ల లక్ష్మణ్‌, వేముల నాగరాజు, గోనే భాస్కర్‌ తదితరులు ఉన్నారు.

వేములవాడ రూరల్‌ : ప్రధాని జన్మదిన వేడుకలు మండలంలో జరిగాయి. బీజేపీ రూర ల్‌ కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసీ స్వీట్లు పంపిణీ చేసారు.బీజేపీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమే ష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : ప్రధాని జన్మది న వేడుకలను ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాలతోపాటు పలుగ్రామాల్లో నిర్వహించారు.

Updated Date - Sep 18 , 2025 | 12:03 AM