డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:20 AM
సుప్రసిద్ధ గేయ రచయిత, బ్రహ్మపుత్ర కవి, గాయకుడు, భారతరత్న డాక్టర్ బూపేన్ హజారికా శతజయంతిని ఈ సంవత్సరమంతా అస్సాం ప్రభుత్వం నిర్వహిస్తోంది.
సిరిసిల్ల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ గేయ రచయిత, బ్రహ్మపుత్ర కవి, గాయకుడు, భారతరత్న డాక్టర్ బూపేన్ హజారికా శతజయంతిని ఈ సంవత్సరమంతా అస్సాం ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆంగ్లంతో పాటు 22 భారతీయ భాషల్లో భారతరత్న భూపేన్ హజారికా పుస్తకాన్ని ప్రచురించారు. ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆదివారం గౌహతిలో జరిగిన భూపేన్ హజారికా శత జయంతి ప్రారంభ సభలో ప్రధానమంత్రి ఆవిష్కరించిన వాటిలో అస్సామీలో అనురాధ శర్మ పూజారి రాసిన 400 పేజీల పుస్తకాన్ని తెలుగులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారగ్రహీత, అనువాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ అనువదించారు. ఒకే వేదికపైన భారతీయ భాషల ఇంద్రధనస్సులో సిరిసిల్ల రచయితకు చోటుదొరకడం, సిరిసిల్లకు చెందిన అనువాదకుడి పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించడంపై సాహితీ సంఘాలు, రయితలు, కవులు అభినందనలు తెలిపారు.