గ్యాస్ స్టవ్‌లపైనే మధ్యాహ్న భోజనం తయారీ
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:42 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఇకనుంచి కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్ స్టవ్‌లపై తయారుచేసి వడ్డించాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు.
సిరిసిల్ల రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఇకనుంచి కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్ స్టవ్‌లపై తయారుచేసి వడ్డించాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం తయారీ కోసం ఏర్పాటుచేసిన గ్యాస్ సిలిండర్‌లతో స్టవ్‌లను సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతిరెడ్డితో కలిసి కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ప్రారం భించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 458ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం తయారుచేసేందుకు గ్యాస్ కనెక్షన్‌లను మంజూరు చేశామన్నారు. విద్యార్థు లకు కట్టెల పొయ్యిలపై ఆహార పదార్ధాలు సిద్ధంచేయవద్దని నిర్వాహకులకు సూచించారు. మండల విద్యాధికారి దూస రఘుపతి, ప్రధానోపాధ్యాయురా లు లోకిని శారద, ఉపాధ్యాయులు ఎలగోండ రవి తదితరులు పాల్గొన్నారు.