గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం..
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:06 AM
గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాం గాన్ని ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తారా, గ్రామ పంచాయతీ ఎన్నిక లను నిర్వహిస్తారా అనే విషయమై స్పష్టత లేదు. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఈ నెల 10వ తేదీకల్లా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాఽధికారులు అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- వార్డుల వారీగా నేటి నుంచి మ్యాపింగ్
- ఈ నెల 10 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు
- గుజరాత్ నుంచి జిల్లాకు చేరిన 1,465 బ్యాలెట్ బాక్సులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాం గాన్ని ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తారా, గ్రామ పంచాయతీ ఎన్నిక లను నిర్వహిస్తారా అనే విషయమై స్పష్టత లేదు. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఈ నెల 10వ తేదీకల్లా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాఽధికారులు అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జిల్లా పంచాయతీ అధికారి వీరబు చ్చయ్య బుధవారం మండల పంచాయతీ అదికారులతో సమావేశం నిర్వహించి మ్యాపింగ్ కోసం సన్నద్ధం చేశారు. జిల్లాలో జూన్ నెల వరకు సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడికి తీసుక వెళ్లారు. రాష్ట్రంలో ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండడంతో ప్రభు త్వం హుటాహుటిన గుజరాత్ రాష్ట్రం నుంచి జిల్లాకు బ్యాలెట్ బాక్సులను తెప్పించింది. వడోదర నుంచి 905 బాక్సులు, ఉదయ్‌పూర్ నుంచి 560 బాక్సులు, మొత్తం 1,465 బాక్సులు మంగళవారం జిల్లాకు చేరాయి. ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి.
జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు, 2,432 వార్డులు ఉన్నాయి. 2019లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వ హించగా, ఇప్పుడు కూడా మూడు విడతల్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఒక్కో విడతలో ఎన్ని కలు నిర్వహించేందుకు 1650 నుంచి 1800కు పైగా బ్యాలెట్ బాక్సులు అవసరం ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు తక్కువ బ్యాలెట్ బాక్సులు అవసరం ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఖరారు చేసిన తుది ఓటర్ల జాబితాను అనుసరించి గ్రామ పంచాయతీల వారీగా ఓటర్లను వేరు చేసి, ఆ పంచాయతీలో ఉన్న వార్డుల సంఖ్య ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ చేయనున్నారు. గతంలో ఎన్నికలు నిర్వహించని లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లి గేట్‌లు తిరిగి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో నిర్వహించారు. కుందనపల్లి పంచాయతీ పరిధిలోని అక్బర్‌నగర్‌ను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఇవిగాకుండా ప్రస్తుతం 263 పంచాయతీలు ఉండగా, కుందనపల్లితో కలుపుకుని 264కు చేరనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం యేటా నాలుగు నెలలకోసారి ఓటర్ల జాబితాలను సవరిస్తు న్నది. 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుంది. గతంలో యేటా జనవరి మొద టి వారంలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించే వారు. ఇప్పుడు నాలుగు విడతల్లో ఓటర్ల సవరణ చేస్తున్నారు. గత నెలలో పూర్తయిన ఓటర్ల సవరణ జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీగా మ్యాపింగ్ చేయనున్నారు. ఆయా పంచాయతీల్లోని జనాభా, ఓటర్లను బట్టి 6 నుంచి 20కి పైగా వార్డులు న్నాయి. ఒక్కో వార్డులో 40 నుంచి 300కు పైగా ఓటర్లు ఉండనున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడంతో సిబ్బంది సన్నద్ధమవుతున్నారు.