Share News

గర్భిణులు పరీక్షలు చేయించుకోవాలి

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:32 AM

గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎనసీడి క్లినిక్‌, ఫార్మసీ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్‌ఆర్‌ను పరిశీలించారు.

గర్భిణులు పరీక్షలు చేయించుకోవాలి
తిమ్మాపూర్‌ పీహెచసీలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచవో వెంకటరమణ

తిమ్మాపూర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎనసీడి క్లినిక్‌, ఫార్మసీ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్‌ఆర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మహిళా హెల్త్‌ క్యాంపుల్లో వంద శాతం రిస్ర్కీనింగ్‌ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణులతో మాట్లాడారు. సిజేరియన చేయించుకోవడం వల్ల వచ్చే సమస్యలను వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలకు ప్రయత్నించాలని, తల్లీబిడ్డలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో ఎనహెచఎం స్వామి, మండల వైద్యాధికారి ప్రిసిల్లా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:32 AM