ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:48 PM
విద్యుత్తు సరఫరాలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ టి మధుసూదన్ అధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం కరీంనగర్ టీజీ ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
గణేశ్‌నగర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సరఫరాలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ టి మధుసూదన్ అధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం కరీంనగర్ టీజీ ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పటికప్పుడు మార్చాలని, లూజ్ కనెక్షన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ సంస్థలతో కలిసి నగరాల్లో ఉన్న కేబుల్ వైర్లను తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖలోని సిబ్బంది తప్పిదాలు ప్రాణాపాయానికి దారితీసే అవకాశాలు ఉన్నందున ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వినాయకుల ప్రతిమలను తరలించే క్రమంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీరు ఆపరేషన్ బి అశోక్, ఎస్‌ఈ మేక రమేష్‌బాబు, డీఈలు ఉపేందర్, జంపాల రాజన్, చంద్రమౌళి, తిరుపతి. ఎస్ లక్ష్మారెడ్డి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్, ఏడీలు ఎన్ అంజయ్య, జి శ్రీనివాస్, లావణ్య పాల్గొన్నారు.