Share News

రహదారులపై గుంతలు.. తప్పని తిప్పలు

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:42 AM

జిల్లా కేంద్రం లోని ప్రధాన రహదారులు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి.

రహదారులపై గుంతలు.. తప్పని తిప్పలు

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం లోని ప్రధాన రహదారులు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతూ స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర నుంచి కరీంనగర్‌ - కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారిపై ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన సంస్థ కేబుల్‌ వైరు ఏర్పాటు కోసం గుంతలు తీశారు. పనులు పూర్తి అయినా కూడా వాటిని యథావిధిగా పూర్తి స్థాయిలో పూడ్చక పోవడంతో గుంతలుగా ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. అలాగే జిల్లా కేంద్రం నుంచి డీఎస్పీ కార్యాలయం మీదుగా సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో కూడా ఇలాంటి గుంత లతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులే ఇలా ఉంటే పట్టణంలోని రోడ్ల పరిస్థితి మరీ ధారుణంగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రా నికి సిద్దిపేట - కరీంనగర్‌ - కామారెడ్డి జిల్లాల నుంచి రావడానికి ప్రధాన రహదారులలో పెద్ద పెద్ద గుంతులైన ఆర్‌ఎన్‌బీ, పంచాయ తీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాహన దారులు ఆరోపిస్తున్నారు. గుంతలతో ప్రమాదంకు గురై వాహనదా రులు ప్రాణాలు కోల్పోక ముందే సంబంధిత అధికారులు స్పందించి జిల్లా కేంద్రం ప్రధాన రహదారులపై ఉన్న గుంతలను పూడ్చి(ప్యాచ్‌ వర్క్స్‌)వేయాలని వాహనదారులు, జిల్లా కేంద్రంలోని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:42 AM