పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:40 AM
గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిం చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిం చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం గ్రామపంచాయతీ ఎన్ని కల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై తహసీల్దార్లు, ఎంపీవోలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లకు ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ట్రైనర్‌లు పీపీటీతో శిక్ష ణఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడు తూ గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుందని తెలిపారు. వారికి సంబంధిత అప్లికేషన్లు ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, వాటిని ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారం నింపి అందజేయాలని సూచించారు. శిక్షణలో శిక్షణ నోడల్ అధికా రి శేషాద్రి, పోస్టల్ బ్యాలెట్ నోడల్‌అధికారి లక్ష్మీరాజం, ట్రైనర్ పాల్గొన్నారు.