Share News

వక్ఫ్‌ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:17 AM

వక్ఫ్‌ సవరణ చట్టంతో పేద, మధ్య తరగతి ముస్లిం సమాజానికి మేలు చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని పార్లమెంట్‌ కార్యాలయంలో వక్ఫ్‌ చట్ట సవరణ-2025పై జన జాగరణ అభియాన్‌ కార్యశాల నిర్వహించారు.

వక్ఫ్‌ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్‌రెడ్డి

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ సవరణ చట్టంతో పేద, మధ్య తరగతి ముస్లిం సమాజానికి మేలు చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని పార్లమెంట్‌ కార్యాలయంలో వక్ఫ్‌ చట్ట సవరణ-2025పై జన జాగరణ అభియాన్‌ కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సంక్షేమం అభివృద్ధి ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు చట్టానికి సవరణలు చేపట్టిందన్నారు. వక్ఫ్‌ ఆస్తులను, సొమ్మును ఇన్నేళ్లు అనుభవించిన వాళ్లకే సవరణ చట్టం మింగుడు పడడం లేదన్నారు. ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్‌ ఆస్తులు ఉన్న బోర్డు ఇన్నేళ్లు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లిం ప్రయోజనాలు సంక్షేమం కోసం ఏనాడు ఆలోచన చేయని ఒవైసీ వక్ఫ్‌ సవరణ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓవైసీ ముసస్లిం సమాజాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ సునీల్‌రావు, సుంకర మౌనిక, నిర్మలదేవి, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిలపు రమేష్‌, కోమల ఆంజనేయులు, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేష్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు, జిల్లా ప్రధాన క్యాదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మాడ వెంకటరెడ్డి, సాయిని మల్లేశం, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, సిద్దిపేట మాజీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పుప్పాల రఘు, ఎన్నం ప్రకాశ్‌, బల్బీర్‌సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:17 AM