Share News

వార్పిన్‌ కార్మికులపై పాలిస్టర్‌ యజమానుల నిర్లక్ష్యం

ABN , Publish Date - May 11 , 2025 | 12:27 AM

స్వశక్తి సంఘాల మహిళలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయిస్తున్న చీరలకు కూలీ నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కార్యద ర్శి కోడం రమణ, వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిరిమల్లె సత్యంలు అన్నారు.

వార్పిన్‌ కార్మికులపై పాలిస్టర్‌ యజమానుల నిర్లక్ష్యం

సిరిసిల్ల రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : స్వశక్తి సంఘాల మహిళలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయిస్తున్న చీరలకు కూలీ నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కార్యద ర్శి కోడం రమణ, వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిరిమల్లె సత్యంలు అన్నారు. వార్పిన్‌ కార్మికులపై పాలిస్టర్‌ యాజమానులు నిర్లక్ష్యం చేస్తున్న దానిపై చేనేత జౌళిశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేకుంటే రిలే నిరహార దీక్షలు చేపడుతామన్నారు. సిరిసిల్ల పట్ట ణం పాత బస్టాండ్‌లోని నేతన్న విగ్రహానికి సీఐ టీయూ ఆధ్వర్యంలో వార్పిన్‌ కార్మికుల సమస్యల ను పరిష్కరించాలంటూ వినతిపత్రాన్ని అందించి విగ్రహం ఎదుట నిరసనలు తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ యజమానులు వార్పిన్‌ కార్మికులపై పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవ లంబిస్తున్నారని అన్నారు. వార్పిన్‌ కార్మికులకు గత బతుకమ్మ చీరల పనికంటే రెండింతలు పని భారం పెరిగిందని, పనికి తగ్గ వేతనం ఇవ్వడా నికి యాజమానులు ముందుకు రావడం లేద న్నారు. యాజమానుల వైఖరిని నిరస్తూ మంగళ వారం నుంచి వార్పిన్‌ కార్మికులు సమ్మె బాట పట్టడం జరిగిందన్నారు. కార్మికుల కూలి నిర్ణ యం చేయవలసిన అధికారులు యాజమాను లకు అప్పజెప్పడం వలన ఈ సమస్య తలెత్తడం జరిగిందన్నారు. జౌళి శాఖ అధికారులు కార్మికుల విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదన్నారు. బట్ట ఉత్పత్తి చేసేది కార్మికులైతే వారితో మాట్లా డడానికి అధికారులు సిద్ధపడటం లేదన్నారు. కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పఽథకం యాజమా నుల పథకంగా మారిపోయిందన్నారు. వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు ఉడుత రవి, నాయకులు మచ్చవేణు, బూట్ల వెంకటేశ్వ ర్లు, ఐరేని ప్రవీణ్‌, సామల నర్సయ్య, శ్రీకాంత్‌, ర మేష్‌, మధు, శంకర్‌, సదానందం, దేవయ్య, రవి, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, సతీ్‌ష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:27 AM