Share News

పాలిసెట్‌ ప్రశాంతం

ABN , Publish Date - May 14 , 2025 | 12:39 AM

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం మంగళవారం నిర్వహించిన పాలిసెట్‌-2025 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేకపోవడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పాలిసెట్‌ నిర్వ హణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

పాలిసెట్‌ ప్రశాంతం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం మంగళవారం నిర్వహించిన పాలిసెట్‌-2025 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేకపోవడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పాలిసెట్‌ నిర్వ హణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

ఫ 2136 మంది విద్యార్థులకు 109 మంది గైర్హాజరు

జిల్లాలో పాలిసెట్‌కు 94.89 శాతం విద్యార్థులు హాజరయ్యారు. వేములవాడ మండలం అగ్రహారం వద్ద ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళశాల, అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌక్‌ సమీపంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళశాల, పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, నెహ్రూనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తంగళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 2,136 మంది విద్యార్థులకు 2,027 మంది విద్యార్థులు హాజరయ్యారు. 955 మంది బాలురకు 898 మంది, 1,181 మంది బాలికలకు 1,129 మంది హాజరయ్యారు. 94.89 హాజరు శాతం ఉంది. 109 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ఇందులో బాలురు 57 మంది, బాలికలు 52 మంది ఉన్నారు.

ఫ భారీ బందోబస్తు..

జిల్లాలోని 7 పాలిసెట్‌ పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలతో పాటు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు సీసీ కమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్షలను సవ్యంగా జరిగే విధంగా పరిశీలకులు రవికుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ భాస్కరాచారిలు పర్యవేక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద వైద్య బృందం ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను సెల్‌ఫోన్‌లు, కాల్యుక్‌లేటర్‌ వంటి ఎలాంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులు తీసుకొని వెళ్లకుండా తనిఖీలు చేశారు. జిల్లాలోని పాలిసెట్‌ కేంద్రాలను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అకస్మికంగా తనిఖీ చేశారు. తంగళ్లపల్లి, సిరిసిల్లలోని కేంద్రాల్లో పరీక్ష తీరు, సౌకర్యాలను పరిశీలించారు. సీసీ టీవీ కమెరాల పనితీరు అడిగి తెలుసుకున్నారు.

పరీక్షకు హాజరైన విద్యార్థులు

పరీక్ష కేంద్రం బాలురు బాలికలు మొత్తం

పాలిటెక్నిక్‌ కళాశాల అగ్రహారం 165 214 379

డిగ్రీ కళాశాల అగ్రహారం 122 149 271

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సిరిసిల్ల 123 158 281

కుసుమ రామయ్య జడ్పీహెచ్‌ఎస్‌ 129 219 348

జడ్పీహెచ్‌ఎస్‌ (బాలికలు) 136 166 302

నెహ్రూనగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ 116 107 223

జడ్పీహెచ్‌ఎస్‌ తంగళ్లపల్లి 107 116 223

----------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 898 1,129 2,027

----------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - May 14 , 2025 | 12:39 AM