పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:04 AM
శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తి గత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎస్పీ మహేష్ బీ గీతే కోరారు.
సిరిసిల్ల రూరల్, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తి గత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎస్పీ మహేష్ బీ గీతే కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యా లయంలో శనివారం పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఎస్పీ మహేష్ బీ గీతే ప్రారంభిం చారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు ఎస్పీ సైతం కంటి పరీక్ష లను చేయించుకున్నారు. అనంతరం జరిగి సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలందించే పోలీసులు ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని, ఆరోగ్య పరిరక్షణ కోసం పోలీసులు వైద్య పరీక్షలకు సమయాన్ని కేటా యించాలన్నారు. విధి నిర్వహణకు అంకిత మైన పోలీసులతో పాటు వారి కుటుంబ స భ్యులు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచి త వైద్యశిబిరాలు ఏర్పాటు చేసస్తున్నామని, ఈ శిబిరాలను పోలీసులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. శిబిరంలో కంటి వైద్యుల బృందం పాల్గొని కంటి ఆరో గ్య పరిశీలన దృష్టి సమస్యల నిర్ధారణ, అవసరమైన మం దులు సూచనలు అందించారు. రోజు వారీ ఒత్తిడి ఫీల్డ్ పనులు, రాత్రిపూట డ్యూటీ కారణంగా కంటి సమస్యలు వ చ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి శిబి రాలు పోలీస్ సిబ్బందికి ఉపయోగపడుతా యన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు మొగిలి, శ్రీనివాస్, రవి, నాగేశ్వర్‌రావు, మధుకర్, అర్‌ఐలు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్‌ఐలు, పోలీ స్ సిబ్బంది పాల్గొన్నారు.