పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటించాలి..
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:27 AM
విలేజ్ పోలీస్ అధికారు లు తమకు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించాలని ఎస్పీ మహేష్ బి గితే పేర్కొన్నారు.
గంభీరావుపేట, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): విలేజ్ పోలీస్ అధికారు లు తమకు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించాలని ఎస్పీ మహేష్ బి గితే పేర్కొన్నారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను మంగ ళవారం ఎస్పీ మహేష్ బి గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీ స్‌స్టేషన్ పరిసరాలను, స్టేషన్ రికార్డును పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను రివ్యూ చేసి స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలు సుకున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలన్నారు. ప్రధానంగా విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలన్నారు. గ్రామస్థాయి లో ఇన్‌ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని ఆదేశించారు. పెట్రో లింగ్ సమయంలో రౌడి షీటర్‌లను తనిఖీ చేయాలని, ప్రతి రోజు స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు బాద్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమ శిక్షణతో ఉండాలని సిబ్బందికి ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్సీ వెంట సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ అని ల్‌కుమార్ తదితరులు ఉన్నారు.