Share News

క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:42 AM

గెలుపు శాశ్వతం కాదు... ఓటమి ముగింపు కాదని , క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని తెలంగాణ వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేష్‌బాబు అన్నారు.

క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : గెలుపు శాశ్వతం కాదు... ఓటమి ముగింపు కాదని , క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని తెలంగాణ వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేష్‌బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జూనియర్స్‌ బాలబాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్‌ జట్ల శిక్షణ శిబిరం ముగింపు సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి మాట్లాడారు. జట్ల ఎంపికలో కొన్ని పద్ధతులు ఉంటాయని, వాటిని అనుసరించడం వల్ల బాగా ఆడే కొందరు పిల్లలకూ అవకాశం రాకపోవచ్చని అన్నారు. ఒక అవకాశం కోల్పేయామంటే మరో మంచి అవకాశం ముందుంటుందని క్రీడాకారులు అర్థం చేసుకోవాలని, ఒకసారి అవకాశం రాలేదని ఎప్పుడు నిరుత్సాహపడవద్దన్నారు. ఆటలో లోపాలు ఎక్కడ ఉన్నాయే తెలసుకొని ఆ లోపాలను సరిదిద్దుకొని మరో సెలెక్షన్‌ కం టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడి ఎంపిక కావాలన్నారు. ఈనెల 15 నుంచి రాజస్తాన్‌లో జరగనున్న జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలో బాలబాలికల జట్లు రాణించాలని, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం బాలబాలికల జట్లకు ట్రాక్‌షూట్‌తో పాటు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. క్రీడా దుస్తులను వితరణ చేసి కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావుకు, వీబీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డికి క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్‌, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గిన్నె లక్ష్మన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాందాస్‌, ఉపాధ్యక్షుడు చింతికింది శ్యాంకుమార్‌, కోశాధికారి కోడం శ్రీనివాస్‌, కోచ్‌లు జీవన్‌, సంపత్‌కుమార్‌, జగన్‌ పాల్గొన్నారు.

ఎంపికైన తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్టు

తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లను ప్రకటించారు. బాలుర జట్టు (12మంది) ఎం రుత్విక్‌(వరంగల్‌), కే అక్షిత్‌(వరంగల్‌), ఆర్‌ సిద్దు(మహుబూబ్‌నగర్‌), డీ నరేష్‌(రంగారెడ్డి) కే అరవింద్‌(ఖమ్మం), వీ నరేందర్‌(నిజామాబాద్‌), జీ జగన్‌(వరంగల్‌), ఇ వీరప్రసాద్‌వర్మ (మహబూబ్‌నగర్‌), వీ అక్షయరాజ్‌(కరీంనగర్‌), ఎస్‌ క్రాంతి(కరీంనగర్‌), ఏ సంతోష్‌కుమార్‌ (నల్లగొండ), పీ చరణ్‌(మెదక్‌), బాలికల జట్టు (12మంది) జీ ఐశ్వర్య(వరంగల్‌), పీ హాసిని( వరంగల్‌), ఎం శ్రీనిధి( మహబూబ్‌నగర్‌) ఆర్‌ శ్రీజన(నలగొండ), ఎస్‌ అమూల్య( నిజామాబాద్‌), ఎం సంగీత(వరంగల్‌), ఎన్‌ శ్రీలేఖ(మహబూబ్‌నగర్‌), ఏ కావ్య(మెదక్‌), ఎస్‌ నందమ్మ(ఖమ్మం), ఎం మానస(మెదక్‌), జీ మైత్రి(మహబూబ్‌నగర్‌), కే సింధూ(నల్లగొండ)ఎంపికైన్నారు. బాలబాలికల జట్లు శనివారం ఉదయం జిల్లా కేంద్రం నుంచి రాజస్తాన్‌కు బయలుదేరి వెళ్తున్నాయి.

Updated Date - Dec 13 , 2025 | 12:42 AM