Share News

మొక్కలు నాటడం అందరి బాధ్యత

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:53 AM

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు.

మొక్కలు నాటడం అందరి బాధ్యత

వేములవాడ టౌన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు. వేములవాడ సీని యర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో వన మహోత్సంలో భాగంగా శని వారం ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ చెట్లు పెంచితే పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. ప్రకృతికి సహజ సిద్దంగా ఉండే విధంగా మొక్కలు పెంచాలని సూచించారు. న్యాయవా దులు నిరంతరం బిజీబిజీగా ఉండే పరిస్థితిల్లో చెట్లు నాటడం ఎంతో ప్రశాంతత కలిగిస్తాయని అన్నారు. వేములవాడకు అద నపు జూనియర్‌ సివిల్‌ కోర్టు ఏర్పాటు అవశ్యకత ఎంతైనా ఉంద న్నారు. కోర్టు పైఅంతస్తు నిర్మాణానిక రూ. 5 కోట్లు మంజూరుకు హై కోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. జ్యుడషియల్‌ ఆఫీసర్‌ నివాస సముదాయం నిర్మాణం కోసం రూ.1.75 కోట్లు మంజూ రు కోసం, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టు మంజూరుకు ప్రతిపాదనలు పంపామని వివరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజను బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించి స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా కోర్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గండ రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, గుడిసె సదానందం, పొత్తూరి అనిల్‌ కుమార్‌, పెంట రాజు, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:53 AM