Share News

ఆయిల్‌పామ్‌ పంట విస్తీర్ణం పెంపునకు ప్రణాళికలు

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:35 AM

జిల్లాలో ఆయిల్‌పామ్‌ పంట విస్తీర్ణం పెంపునకు పటిష్టమైన ప్రణాళికలను అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ ఆదేశించారు.

ఆయిల్‌పామ్‌ పంట విస్తీర్ణం పెంపునకు ప్రణాళికలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆయిల్‌పామ్‌ పంట విస్తీర్ణం పెంపునకు పటిష్టమైన ప్రణాళికలను అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధనపై ఉద్యానవనశాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ అవసరాలకు సరిపడా వంటనూనె మన దగ్గర పండటం లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకో వాల్సిన పరిస్థితి ఉందని, దీనివల్ల దేశానికి కోట్లలో నష్టం వస్తుందన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ పెరగడం వల్ల రైతులకు అధిక లాభం రావడం తోపాటు దేశానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 4వేల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం లక్ష్యమని తెలిపా రు. సాగుపై ఆసక్తిగా ఉన్న రైతుల రిజిస్త్రేషన్‌, పరిపాలన మంజూరు ప్రక్రి య త్వరగా పూర్తిచేయాలని సూచించారు. జూలై నుంచి ఇప్పటివరకు 67 మంది రైతుల నుంచి 257 ఎకరాలల్లో 110 టన్నులు సేకరించి రూ 19, 681 టన్నుకు మద్దతు ధర వచ్చిందని ఫ్రీయానిక్‌ కంపెనీ సేకరించడం జరిగింద న్నారు. సిద్దిపేట జిల్లాలో కంపెనీ ఉందనిరైతులు పంట విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్‌ పంట సాగుతో లాభా లు సాగు విధానం మద్దతు ధర, తదితర అంశాలపై రూపొందించిన కరప త్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత, జిల్లా సహకారశాఖ అధికారి రామకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారులు గోవర్థన్‌, లోకేష్‌, కంపెనీ ప్రతిని ధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:35 AM