Share News

వర్షపు నీరు నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:35 AM

నగరంలో వర్షపు నీరు నిలువకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన నగరంలో పర్యటించి ఇటీవల వరద నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించారు.

వర్షపు నీరు నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి
నగరంలో పర్యటిస్తున్న జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): నగరంలో వర్షపు నీరు నిలువకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన నగరంలో పర్యటించి ఇటీవల వరద నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, డ్రైనేజీలో చెత్త చెదారంతోపాటు పేరుకుపోయిన సిల్టు తొలగించాలన్నారు. నగరపాలక సంస్థ, ఆర్‌ఆండ్‌బీ అధికారుల సమన్వయంతో వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజి వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, ఈఈ యాదగిరి, డీఈ లచ్చిరెడ్డి, ఏసీపీ శ్రీధర్‌, డీఆర్‌ఎఫ్‌, సానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

గంగాధర: సీజనల్‌ వ్యాఽధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపడుతూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. గంగాధరలో ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణంలో కొనుగోళ్ల రిజిస్టర్‌, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యవసాయ విస్తరణ అధికారులు దుకాణాల వారీగా నిఘా ఉంచాలని, నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, క్యాంపులు ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని రకాల మందులను స్టాక్‌ ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యేక్రమంలో ఆర్డీవో మహేశ్వర్‌, జిల్లా వ్యవసాధికారి భాగ్యలక్ష్మీ, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, తహసీల్దార్‌ అనుపమ, ఎంపీడీవో రాము, వైద్యాధికారి శ్వేత పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 12:35 AM