ప్రజా పోరాటయోధులను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:16 AM
ప్రజా పోరాటాలు చేసి న ప్రజా పోరాటయోధులను ఆదర్శంగా తీసుకొని విప్లవోద్యమంలో ఎర్రజెండా నీడలోకి అందరూ కలసిరావాలని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పోరాటాలు చేసి న ప్రజా పోరాటయోధులను ఆదర్శంగా తీసుకొని విప్లవోద్యమంలో ఎర్రజెండా నీడలోకి అందరూ కలసిరావాలని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏఐఎఫ్‌టీయూ (న్యూ) ఆధ్వర్యంలో చండ్ర పుల్లారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహిం చారు. ముందుగా జిల్లా కేంద్రం శాంతినగర్ చౌరస్తాలో సీపీఐ(ఎం ఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శాంతినగర్ చౌరస్తా నుంచి వరలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు కళాకారులు ఆటపాటల మధ్య ర్యాలీ నిర్వహించి అలరించారు. వరలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అధ్యక్షతన చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ జరిగింది. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథి ప్రసాద్ మాట్లాడారు. భూమి కోసం భుక్తి కోసం అమరులైన వీరులందరికి నివాళులర్పిస్తున్నామన్నారు. విద్యార్థి దశలో ని చండ్ర పుల్లారెడ్డి విప్లవోద్యమానికి అంకితమైనాడన్నారు. గిరిజన ప్రజల కోసం ప్రజా పోరాటాలు ప్రతిఘటన పోరాటాలు చేసిన చండ్ర పుల్లారెడ్డి అడవి జీవితం, జైలు జీవితాలను గడి పాడన్నారు. ప్రజా పోరాటాలయోధుడు తుదిశ్వాస వరకు ప్రజల కోసం పోరాడిన మహో న్నతమైన విల్లవవీరుడు చండ్ర పుల్లారెడ్డిని మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మోడం మల్లే శం, కోశాధికారి బామండ్ల రవీందర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వొల్లాల కిషోర్, రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య, ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం పెద్దోళ్ల సంగీత, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి మాసం అంజనేయులు, రైతు కూలీ సంఘం నాయకు లు ఆనంద్, ఐలయ్య, ప్రసాద్, శ్రీహరి, కార్మికులు పాల్గొన్నారు.