Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారు

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:18 AM

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారు
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. ధర్మపురి పట్టణంలోని ఓ గార్డెన్సలో నియోజకవర్గస్థాయి 108 మంది నూతన సర్పంచులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని, కాంగ్రెస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. మొదట నంది చౌక్‌ వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగుర వేశారు. కమలాపూర్‌ చౌరస్తా వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఫంక్షన హాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 70 శాతం పైగా సీట్లు గెలుచుకొని ప్రజల విశ్వాసాన్ని చూరగొందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అసహనంతో, విచక్షణరాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిజాలు మాట్లాడితే బీఆర్‌ఎస్‌ నాయకులు తట్టుకోలేరన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం పోలింగ్‌ రోజు బీజేపీకి ఓటు వేయాలని పరోక్షంగా ప్రచారం చేసిందని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నిధుల మళ్లింపుపై త్వరలో సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నూతన సర్పంచులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. సర్పంచుల విజయమే కాంగ్రెస్‌ పార్టీ బలానికి నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో మరింత ఘన విజయాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని ఆయన అన్నారు.

డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య మాట్లాడుతూ సీఎం రేవంతరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ నాయకత్వంలో జిల్లాలో భారీ సంఖ్యలో సర్పంచులను గెలిపించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు కాంగ్రెస్‌ వైపు నిలిచి భారీ మెజార్టీ ఇచ్చారని ఆయన వివరించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇనచార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ద్వారా జిల్లాలో అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గ స్థాయి సర్పంచులను మంత్రి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్యను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు, ధర్మపురి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్‌, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్‌, ధర్మారం మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు వేముల సుభాష్‌, ముస్కు నిశాంతరెడ్డి, తాటిపర్తి శైలేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సనలు చిలుముల లావణ్య, గుండాటి గోపిక, భీమ సంతోష్‌, రూప్లానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:18 AM