Share News

భారత సైన్యానికి దేశవ్యాప్తంగా ప్రజల జేజేలు

ABN , Publish Date - May 19 , 2025 | 12:45 AM

భారత సైన్యానికి దేశవ్యాప్తంగా ప్రజలు జేజేలు పలుకుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

భారత సైన్యానికి దేశవ్యాప్తంగా ప్రజల జేజేలు

ఇల్లంతకుంట, మే 18 (ఆంధ్రజ్యోతి) : భారత సైన్యానికి దేశవ్యాప్తంగా ప్రజలు జేజేలు పలుకుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన అంతటి అనీల్‌ అపరేషన్‌ సిందూర్‌లో పాల్గొని ఆదివారం స్వగ్రామం అయిన ఇల్లంతకుంటకు వస్తుండగా కేంద్రహోంశాఖ మంత్రి వంతడుపుల గ్రామంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సత్తాను నిరూపించుకుందన్నారు. ఉగ్రవాద మూలాలు లేకుండా చేయాలన్నదే భారత ప్రభుత్వ సంకల్పం అన్నారు. పాకిస్తాన్‌ ఏయిర్‌బేస్‌లపై దాడులు చేయడంతో మూడు రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుండి రక్షణ రంగానికి నిధుల కేటాయింపు పెంచుతు వస్తుందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో 13.45శాతం నిధులను రక్షణ రంగానికి కేటాయించిందని పేర్కొన్నారు. భారత రక్షణ రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ఇల్లంతకుంటకు చెందిన అనీల్‌ భాగస్వామి అవడం అదృష్టం అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్రనాయకుడు సొల్లు అజయ్‌వర్మ, మండల అధ్యక్షుడు భూమల్ల అనీల్‌కుమార్‌, మాజీ అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్‌, నాయకులు అన్నల్‌దాస్‌ వేణు, మ్యాకల మల్లేశం, బాల్‌రెడ్డి, సాయగౌడ్‌, అనీల్‌, చిమ్మనగొట్టు శ్రీనివాస్‌, నరేష్‌, వజ్జపల్లి శ్రీకాంత్‌, బత్తిని స్వామి, గుంటి మహేష్‌, రవీందర్‌రెడ్డి, సాయిప్రసాద్‌, సంతోష్‌లతో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

నూతన వధూవరులకు ఆశీర్వాదం..

మండలంలోని వంతడుపుల గ్రామంలో బీజేపీ నాయకుడు నవీన్‌ వివాహ వేడుకలలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ పాల్గొని నూతన వధూవరులను ఆశ్వీరదించారు. మండలానికి వచ్చిన సంజయ్‌కుమార్‌కు బీజేపీ నాయకులు పొత్తూరు గ్రామంలో ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మండలంలోని పలు సమస్యలు వివరించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:45 AM