Share News

అర్హులకు చేయూత పింఛన్‌ అందించాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:18 AM

అర్హులకు చేయూత ఫించన్‌ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

అర్హులకు చేయూత పింఛన్‌ అందించాలి

సిరిసిల్ల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అర్హులకు చేయూత ఫించన్‌ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో చేయూత పిం ఛన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహంచారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చేయూత పథకం కింద వృద్ధులు, ది వ్యాంగులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు, వితంతువులు, నేతన్నలు, గీతాకార్మికులు, బీడీకార్మికులు, టేకేదార్లు, ఒంటరి మహిళలు, డయాల సిస్‌, పైలేరియా రోగులకు ప్రభుత్వం పింఛన్‌ అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం వృద్ధుల పింఛన్‌ తీసుకుంటున్న వారు మరణిస్తే వారి స్థా నంలో జీవిత భాగస్వామికి పెన్షన్‌ మంజూరు చేయడం, హెచ్‌ఐవీ, డయాలసిస్‌ పింఛన్‌ పోర్టల్‌ ఓపెన్‌ ఉందన్నారు. ప్రతి గ్రామంలో పం చాయతీ కార్యదర్శులు పెన్షన్‌కు సంబంధించి రెండు రిజిస్టర్లు మెయిం టెన్‌ చేయాలన్నారు. ఒక రిజిస్టర్‌లో మంజూరుచేసిన పింఛన్‌దారుల వివరాలు, మరో రిజిస్టర్‌లో అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలు రాయా లని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని అన్నారు. వృద్ధాప్య పెన్షన్‌దారులు మరణిస్తే వెంటనే పెన్షన్‌ వారి జీవిత భాగస్వామికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచా యతీ కార్యదర్శులు జనన, మరణ సర్టిఫికెట్‌ జారీ వివరాల రిజిస్టర్‌ పక్కాగా నిర్వహించాలని అన్నారు. జనన, మరణ సర్టిఫికెట్‌ ఆరు నెల లలోపు మాత్రమే స్థానికంగా పంచాయతీ కార్యదర్శులు జారీ చేయాల ని, తర్వాత రెవెన్యూ డివిజన్‌ అధికారికి మాత్రమే ఆ హక్కు ఉంటుం దని తెలిపారు. చేయూత పింఛన్‌దారులు మరణిస్తే వెంటనే చనిపో యినట్లు మార్కింగ్‌ చేయాలన్నారు. పెన్షన్‌ తీసుకుంటున్న వారు శాశ్వతంగా వలస పోతే క్షుణ్ణంగా విచారించిన తర్వాత పెన్షన్‌ తీసి వేయాలన్నారు. ప్రజా భవన్‌ దగ్గర జరిగే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్టు 3 నుంచి 4 రోజుల్లో సమర్పించాలని తెలిపారు. నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీం అర్హులైన పేదలకు అందాలని తెలిపారు. ఈ పథకం కింద 18 నుంచి 59 సంవ త్సరాల వయస్సుగల నిరుపేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఒకేసారి రూ.20వేల సహాయం అందుతుందని, దారి ద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తి స్తుందన్నారు. ఆపద్బంధు, జేబీవై, ఏఏబీవై పథకం లబ్ధిదారులకు ఈ స్కిమ్‌ వర్తించదన్నారు. పథకం కింద వచ్చిన దరఖాస్తులను తహసీ ల్దార్‌ విచారించి ఆర్డీఓలకు రిపోర్ట్‌ అందించాలని, డీఆర్‌ఓ ద్వారా సెర్ప్‌ కు పంపాలన్నారు. ఆధార్‌ కార్డు, డెత్‌ సర్టిఫికెట్‌, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో పరిశీలించాలన్నారు. ఈ సమా వేశంలో డైరెక్టర్‌ సెర్ప్‌ గోపాల్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషా ద్రి, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:18 AM