Share News

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:44 PM

ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తరువాత అందించే పెన్షన్‌ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు
సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి

సుభాష్‌నగర్‌, నవంబరు 6(ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తరువాత అందించే పెన్షన్‌ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని టీఎన్‌జీవో కార్యాలయంలో టీఎన్‌జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షనర్ల సమస్యలు, ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, 317 జీవో ప్రభావం వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, జీపీఎఫ్‌, ఇన్సూరెన్స్‌, లీవ్‌ సాలరీ, మెడికల్‌ బిల్లులు వంటి చెల్లింపులు నెలల తరబడి వాయిదా పడుతున్నాయన్నారు. రైటైర్డ్‌ ఉద్యోగుల తమ పిల్లల పెళ్ళిళ్లు చేయలేక, పిల్లల చవువులు, వివాహాలకు చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి సంగెం లక్ష్మణరావు, అసోసియేట్‌ అధ్యక్షుడు ఒంటెల రవీందర్‌రెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగులు నరసింహస్వామి, రాగి శ్రీనివాస్‌, గూడ ప్రభాకర్‌రెడ్డి, సందీప్‌రావు, సర్దార్‌ హర్మిందర్‌సింగ్‌, హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేశ్‌భరద్వాజ్‌, కార్యదర్శి వెలిచాల సుమంత్‌రావు, రూరల్‌ అధ్యక్షుడు వాస్తవిక్‌గౌడ్‌, కార్యదర్శి కొమ్మెర శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మాపూర్‌ యూనిట్‌ అధ్యక్షుడు పోలు కిషన్‌, కార్యదర్శి నాగరాజు, చొప్పదండి అధ్యక్షుడు కామ సతీష్‌, హుజురాబాద్‌ అధ్యక్షుడు చింతల సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:44 PM