Share News

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:21 AM

వేములవాడ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో పనులను త్వరగా పూర్తిచేయాల ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు.

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

వేములవాడ టౌన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): వేములవాడ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో పనులను త్వరగా పూర్తిచేయాల ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పంచాయతీరాజ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో గల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు, పలు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో నిర్మాణం లో ఉన్న రోడ్లు, ఇప్పటికి ప్రారంభించిన పనులు, సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ ఆర్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమా వేశంలో ఈఈలు సుదర్శన్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, డీఈలు పవనకుమారి, సత్యనారాయణ, విష్ణువర్ధన్‌ ఏఈలు ఉన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:21 AM