Share News

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:48 PM

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోతుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులను వాహనంలో తరలించారు.

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోతుండటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులను వాహనంలో తరలించారు. విద్యార్థులను రెచ్చగొడు తున్నారని ఇద్దరిని పోలీసులు పట్టుకుని అనంతరం వదిలివేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ స్కాలర్‌షిప్‌ ప్రభుత్వ భిక్ష కాదు విద్యార్థుల హక్కు అని అన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.8,700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుండగా విద్యార్థులకు మొండిచేయి చూపించిందన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో చాలా ప్రైవేటు కళాశాలలు మూసివేస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. దాంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం పరోక్షంగా కార్పొరేట్‌ వ్యవస్థకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి బకాయిలను వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్‌, జిల్లా కన్వీనర్‌ పూసాల విష్ణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విగ్నేష్‌, నగర కార్యదర్శి చిప్ప యోగేష్‌, భామండ్ల నందు, జోనల్‌ ఇంచార్జిలు ఆకాష్‌, హరీష్‌, ప్రశాంత్‌, సుధీర్‌సింగ్‌, అశ్విని, అభినయ్‌, పావని, అక్షయ, అక్షిత, విష్ణు, నాగరాజు, స్పూరి ్తగాయత్రి, వంశీ, చరణ్‌ విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:48 PM