లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులను పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:07 AM
సెప్టెంబర్ 13న జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే కేసులను కోర్టుల వారీగా పరిష్కరించాలని ప్రిన్సిపల్ డిసిక్ట్, సెషన్స్ జడ్జి ఎస్ శివకుమార్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కోరారు. ప్రిన్సిపల్ డిసిక్ట్, సెషన్స్ జడ్జి ఎస్ శివకుమార్‌తో కో - ఆర్డినేషన్ మీటింగ్‌లో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబర్ 13న జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే కేసులను కోర్టుల వారీగా పరిష్కరించాలని ప్రిన్సిపల్ డిసిక్ట్, సెషన్స్ జడ్జి ఎస్ శివకుమార్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కోరారు. ప్రిన్సిపల్ డిసిక్ట్, సెషన్స్ జడ్జి ఎస్ శివకుమార్‌తో కో - ఆర్డినేషన్ మీటింగ్‌లో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. సైబర్ నేరాల్లో ఖాతాల్లో నిలిపివేసిన మొత్తాన్ని బాధితులకు రిఫండ్ చేసే అంశాన్ని లోక్ అదాలత్ సమయంలో మాత్రమే కాకుండా రెగ్యులర్‌గా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీ నెంబర్‌లు లేని కేసులకు సీసీ నెంబర్‌లు కేటాయించాలని కోరారు. సాక్షులను వర్చ్యువల్‌గా ప్రవేశపెట్టే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ సీసీఆర్‌బీ శ్రీనివాస్ జి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.