Peddaplli : బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:35 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్ల విషయంలో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించడంతో వచ్చే నెల 8వ తేదీన విచారిస్తామని కోర్టు ప్రకటించడంతో ప్రభుత్వం తీసుకవచ్చిన జీఓ నిలుస్తుందా, నిలవదా అనే విషయం చర్చనీయాం శంగా మారింది.
- 42 శాతం కల్పించడంపై హైకోర్టులో పిటిషన్
- వచ్చే నెల 8న తుది విచారణ
- నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్ల విషయంలో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించడంతో వచ్చే నెల 8వ తేదీన విచారిస్తామని కోర్టు ప్రకటించడంతో ప్రభుత్వం తీసుకవచ్చిన జీఓ నిలుస్తుందా, నిలవదా అనే విషయం చర్చనీయాం శంగా మారింది. ప్రభుత్వం సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకే ముందుకు వెళుతున్నట్లు సమాచారం. శనివారం మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను రొటేషన్ ప్రకారం ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు 2024 కులగణన సర్వే ప్రకారం చేపట్టిన లెక్కలను అనుస రించి రిజర్వేషన్లు ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పిస్తూ ఈ నెల 26వ తేదీన సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 9ని జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజ ర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఉన్నప్పటికీ ప్రభు త్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, దీనిని కొట్టి వేయాలని రెడ్డి జాగృతి సంఘం నాయ కుడు ఒకరు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయంత్రం వరకు కోర్టు విచారించి వచ్చే నెల 8వ తేదీ వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుక వచ్చి గవర్నర్ ఆమోదానికి పంపించి 3 నెలలు గడవక ముందే జీఓ ఎలా తీసుక వస్తారని కోర్టు ప్రశ్నించింది. ఒకవేళ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినా కూడా రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తా మని ప్రకటించింది. దీంతో బీసీలకు 42 శాతం కల్పిం చిన జీఓ కోర్టులో నిలుస్తుందా, లేదా అనే చర్చ జరుగుతున్నది.
ఫ రిజర్వేషన్లపై కొందరిలో నిరాశ..
జిల్లాలో ఆయా స్థానాలపై తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందని ఆశించిన పలువురి నేతల అంచనాలు తలకిందులు కావడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రెండేళ్లుగా కొందరు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పదవులపై ఆశలు పెట్టుకుని ప్రజలను మచ్చిక చేసుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. బీసీ వస్తుందని ఆశ పడ్డ స్థానాలు జనరల్‌కు రావడం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా పోతున్నది. బీసీ లేదా జనరల్ వస్తుందని ఆశించిన వారికి ఎస్సీ రావడంతో షాక్‌కు గురవుతున్నారు. తమకు పోటీ చేసే అవకాశం పోతున్నదని అసంతృప్తికి గురవుతున్నారు. సర్పంచ్ స్థానం తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందను కున్న వారి ఆశలు ఎంపీటీసీ స్థానంలో పదిలంగా ఉన్నాయి. ముందుగా ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ముందుకు సాగుతున్నది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అదృష్టం వరించని వాళ్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తేల్చుకోవాలని భావిస్తున్నారు.