Share News

peddapally : గంజాయి మత్తులో యువత

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:03 AM

కోల్‌సిటీ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పల్లెల నుంచి పట్టణాల వరకు గంజాయి దందా జోరుగా సాగుతోంది.

peddapally :  గంజాయి మత్తులో యువత

- పల్లెల నుంచి పట్టణాల వరకు సరఫరా

- కమిషనరేట్‌లో నార్కోటిక్‌ టీమ్‌ల ఏర్పాటు

- రవాణా, అమ్మకాలపై ప్రత్యేక నిఘా

- కమిషనరేట్‌ పరిధిలో 1.91క్వింటాళ్ల గంజాయి పట్టివేత...

- 68కేసుల్లో 216మంది అరెస్టు

- విద్యా సంస్థలు, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు

కోల్‌సిటీ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పల్లెల నుంచి పట్టణాల వరకు గంజాయి దందా జోరుగా సాగుతోంది. విద్యార్థులు, యువత గంజాయి మత్తుకు బానిసవుతు న్నారు. హైస్కూల్‌స్థాయి నుంచి మొదలు డిగ్రీ స్థాయి విద్యార్థులు మత్తులో జోగుతున్నారు. గంజాయికి బాని సైన యువత మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్ర దేశ్‌లోని విశాఖ ఏజెన్సీలకు బైక్‌లు, రైళ్లలో వెళ్లి గం జాయి ఇక్కడకు తీసుకువస్తున్నారు.

గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఆదేశాలతో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ప్రత్యేకంగా నార్కోటిక్‌ టీములను ఏర్పాటు చేశారు. రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ టీములు పని చేస్తున్నాయి. ఈ టీముల ఏర్పాటు తరు వాత కమిషనరేట్‌లో భారీ ఆపరేషన్లు నిర్వహించారు. గంజాయి రవాణా లింకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ వరకు రామగుండం కమిషరేట్‌ పరిధిలో 68కేసుల్లో 216మందిని అరెస్టు చేశారు. 191కిలోల గంజాయిని సీజ్‌ చేశారు.

ఫిబ్రవరి 20న గోదావరిఖని టుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 11ఏ క్రాస్‌ వద్ద పోలీసులు రెండు కార్లలో తర లిస్తున్న 86.7కిలోల గంజాయిని స్వాధీనం చేసుకు న్నారు. ఉత్తరప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఉదయ్‌ వీర్‌, రాజ్‌లోతి సంజీవ్‌, కేవశ్‌ కర, సోమంత్‌ కొరలను అరెస్టు చేశారు. వీరు ఛత్తీస్‌గఢ్‌ నుంచి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు.

మంచిర్యాల జిల్లాలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయిని కస్టమర్లకు సరఫరా చేస్తున్న ముఠాను నార్కోటిక్‌ బృందం పట్టుకున్నది. 22మందిపై కేసులు నమోదు చేసి 23.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్ర నుంచి రైలులో గంజాయిని తీసుకువచ్చిన రామకృష్ణ అనే వ్యక్తిని రామగుండం పోలీసులు పట్టుకుని 15.9కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రామగుండం కమిషనరేట్‌లో గంజాయి రవాణా, అమ్మకాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజా యి రవాణా చేస్తున్న వ్యక్తులతో పాటు వినియోగిస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలోనే 98 మంది అరెస్టు

ఈ ఏడాది పెద్దపల్లి జిల్లాలోనే గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించి 34కేసుల్లో 98మందిని పోలీ సులు అరెస్టు చేశారు. జిల్లాలోని వివిధ ఠాణాల పరిధిలో పోలీసులు దాడులు చేసి 157కిలోల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.77.63 లక్షలుగా ఉంటుందని అంచనా.

విద్యా సంస్థలు, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు

పాఠశాల స్థాయిల్లో గంజాయి వినియోగం పెరిగి పోవడంతో పోలీసులు విద్యా సంస్థలు, వివిధ కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంజాయి వినియోగంపై సమాచారం ఉన్న కాలనీల్లో జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. విద్యా సంస్థల్లో గం జాయి అలవాటు, గంజాయి సేవించే వారి లక్షణాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి వివరిస్తున్నారు. గంజాయికి ఒక్కసారి అలవాటు అయితే జీవితం నాశనం అవుతుందని తెలియజేస్తున్నారు. పోషకుల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గంజాయి నిర్మూలనకు చర్యలు...

సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

ప్రజలు, యువకుల తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకు రావడం ద్వారా గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం. గంజాయిని సమాజం నుంచి దూరం పెట్టాలనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. గ్రామాలు, కాలనీల్లో గంజాయిని దరి చేరనివ్వద్దు. ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావాలి. పిల్లల ప్రవర్తన, మాన సిక స్థితిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి.

Updated Date - Sep 01 , 2025 | 01:03 AM