peddapally : కాలువలు తీసేవారు లేరు...
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:38 AM
కోల్‌సిటీ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రెండున్నర లక్షల జనాభా ఉన్న రామగుండంలో పారిశుధ్యానికే యేటా రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు.
చెత్త ఎత్తేవారు లేరు...
- రామగుండంలో పారిశుధ్యం అస్తవ్యస్తం
- రికార్డుల్లోనే కార్మికులు
- యేటా పారిశుధ్యానికే రూ.12కోట్ల వ్యయం...
- కార్పొరేషన్ పని తీరుపై ప్రజల్లో అసంతృప్తి
- వారం రోజులు గడువు ఇచ్చిన ఎమ్మెల్యే
కోల్‌సిటీ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రెండున్నర లక్షల జనాభా ఉన్న రామగుండంలో పారిశుధ్యానికే యేటా రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు. అది కూడా కార్పొరేషన్ విస్తీర్ణంలోని 60శాతం ప్రాంతానికే కార్పొరేషన్ సేవలం దిస్తుంది. ఈ ప్రాంతంలో కూడా నిర్వహణ సరిగా లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్గం ధంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారిస్తున్నామని అధికార యంత్రాం గం చెబుతున్నా సమీక్షలకు, సమావేశాలకే పరిమితమ వుతుంది. క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు గమనిం చకపోవడం, కార్యాచరణ అమలు చేయకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే అన్న రీతిలో ఉంది. ఎమ్మెల్యేనే స్వయంగా పారిశుధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా వారం రోజుల్లో మెరుగుపడకపోతే ప్రభుత్వ పరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
రామగుండం నగర పాలక సంస్థ 93.87చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. 61వేల నివాసాలు న్నాయి. ఇందులో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, జెన్‌కో, రైల్వే కాలనీ ప్రాంతాలకు ఆ సంస్థల యాజమాన్యాలే పారిశుధ్య నిర్వహణ చేపడుతాయి. కేవలం 51వేల నివాసాలకే కార్పొరేషన్ పారిశుధ్య సేవ లందిస్తుంది. మొత్తం 50డివిజన్లు ఉండగా 35 డివిజన్లలో కార్పొరేషన్ పూర్తిస్థాయి పారిశుధ్య సేవలం దిస్తుండగా కొన్ని డివిజన్లలో కొంత భాగం కార్పొరేషన్, కొంత పరిశ్రమలు సేవలందిస్తున్నాయి.
కార్మికులకు, వాహనాలకు కొరత లేదు...
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో 371మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఇందులో ముగ్గురు పర్మినెంట్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లతోపాటు 13 మంది జవాన్లు, 178మంది స్వీపర్లు, 49మంది డ్రైన్ క్లీనర్లు, 53 మంది స్వచ్ఛ ఆటోడ్రైవర్లు, 57మంది లిఫ్టర్లు, 18మంది ట్రాక్టర్ డ్రైవర్లు, ముగ్గురు రోజువారీ కార్మికులు పని చేస్తున్నారు. వీరితో పాటు ఇంటింటా చెత్త సేకరణకు 124 మంది పని చేస్తుండా వారికి కార్పొరేషన్ నెలకు రూ.4వేల ప్రోత్సాహకం ఇస్తుంది. మరో 29మంది పార్కు వర్కర్లు ఉన్నారు. మొత్తం 495మంది పారిశుఽ ద్యంలో పని చేస్తుండగా 29మంది పార్కు నిర్వహ ణలో పని చేస్తున్నారు. మొత్తం 12జోన్‌లలో పారిశుధ్య నిర్వహణ జరుగుతుంది. వాహనాలకు కూడా కొరత లేదు. రెండు కాంపాక్టర్లు, ఒక స్వీపింగ్ మిషన్, 53 స్వచ్ఛ ఆటోలు, 1 ఎక్స్‌కావేటర్, రెండు బాబ్‌కార్ట్ ప్రొక్లై నర్లు, ఒక చిన్న ఎక్స్‌కావేటర్, ఒక బాబ్ కార్ట్ లోడర్, 18ట్రాక్టర్లు, 3ఫ్రంట్ బ్లేడ్ లోడర్లు, రెండు స్కై లిఫ్టర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్వహణకు జెట్టింగ్ మిషన్, లిట్టర్ పిక్కర్ తదితర యంత్రాలున్నాయి.
రికార్డుల్లోనే కార్మికులు... క్షేత్ర స్థాయిలో కొరత...
పారిశుధ్య నిర్వహణలో రామగుండం నగరపాలక సంస్థలో 495మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. వీరిలో 371మందే పారిశుధ్య నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేవారు. ఇందులో 178మంది స్వీపర్లు, 49మంది డ్రైన్ క్లీనర్లు, 72మంది డ్రైవర్లు, 57మంది లిఫ్టర్లుగా లెక్క చూపుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చెత్త ఎత్తే లిఫ్టర్లు, కాలువలు తీసే డ్రైన్ క్లీనర్ల కొరత ఉంది. వారసత్వ ఉద్యోగాల పేర ఎనిమిదేళ్లలో 60కి పైగా కార్మికులు చేరారు. కొందరు కార్మికుల కుటుంబ సభ్యులైతే మరికొందరు పనులు కొన్నవారు ఉన్నారు. ఇలా పనుల్లోకి ఎక్కిన వారు నిబంధనల ప్రకారం అదే పనికి వెళ్లాల్సి ఉంటుంది. కార్యాలయంలో పనులు మార్చుతున్నారు. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.70 వేల వరకు లంచాలు తీసుకుని కార్యాలయం డ్రైవర్లుగా, ఇతర చోట్ల పనులు అప్పగిస్తున్నారు. ఇలా 39మంది పారిశుధ్య విభాగంలో స్వీపర్లుగా, లిఫ్టర్లుగా, డ్రైన్ క్లీనర్లుగా పేర్లు ఉన్నా క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణలో లేరు. ఒక జోన్ పరిధిలో నాలుగు డివి జన్లు ఉంటే ఒక్కరే డ్రైన్ క్లీనర్ పని చేయాల్సిన పరి స్థితి ఉంది. ఆ జోన్ పరిఽధిలోని ఒక డ్రైన్ క్లీనర్ వారస త్వం ఉద్యోగం పెడితే ఉద్యోగంలోకి చేరని వ్యక్తిని మొదట కార్యాలయంలోకి తీసుకుని తరువాత ఏకంగా పర్యవేక్షణ బాధ్యతనే అప్పగించారు. దీంతో క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరత ఏర్పడి ఇంటింటా చెత్త సేకరణ చేసే రిక్షా కార్మికులను డ్రైన్ క్లీనర్లుగా, లిఫ్టర్లుగా వాడుకుంటున్నారు. వాస్తవానికి వీరికి కార్పొ రేషన్ వేతనం ఇవ్వదు. తమతో వెట్టి చేయించుకుంటు న్నారని కార్మికులు వాపోతున్నారు.
సింగరేణి ఏరియాలోనూ కార్పొరేషన్ సేవలు...
రామగుండం నగర పాలక సంస్థ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్ల మధ్య పారిశుధ్య నిర్వహణకు హద్దులు ఉండేవి. రాను రాను పరిస్థితులు మారిపోయి సింగరేణి ప్రాంతాలైన మున్సిపల్‌జంక్షన్, చౌరస్తా రహదారి, ఆర్‌సీఓఏ క్లబ్ రహదారి, లేబర్‌కోర్టు ఏరియా, తిలక్‌నగర్, విఠల్‌నగర్ ఏరియాల్లో కార్పొరేషన్ పారిశుధ్య సేవలు చేస్తుంది. దీంతో అదనంగా 50 నుంచి 55మంది కార్మికులు ఈ పనులకు కేటాయిస్తున్నారు.
ముటా రూ.12కోట్ల వ్యయం...
రామగుండం నగర పాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు యేటా రూ.12కోట్ల వ్యయం చేస్తున్నారు. నెలకు రూ.75లక్షలు కార్మికుల వేతనాలు, రూ.20లక్షలు డీజిల్ బిల్లులతో పాటు బ్లీచింగ్, సున్నం, పనిముట్లు, కార్మికుల సామగ్రి తదితర కొనుగోళ్లకు రూ.40లక్షలు, యేటా పూడికతీతకు రూ.30 నుంచి రూ.40లక్షలు, రిపేర్లకు రూ.10లక్షలు, ఇతర కార్యక్రమాల పేర మరో రూ.20 నుంచి రూ.30లక్షలు వెచ్చిస్తున్నారు.
పర్యవేక్షణ లోపమే శాపం...
కార్పొరేషన్‌లో పారిశుధ్య నిర్వహణలో పర్యవేక్షణ లోపమే కారణంగా కనిపిస్తున్నది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం, పరిష్కారాలు చూపకపోవడమే అడ్డంకిగా మారింది. వార్డు ఆఫీసర్లు ఫొటోలు దిగి ఇండ్లకు పోతున్నారు. కార్పొరేషన్ యంత్రాంగం ఇప్పటికైనా రికార్డుల్లో ఉన్న కార్మికులందరికి పూర్తి స్థాయిలో పనుల్లో పెట్టడం, స్వశక్తి సంఘాల సహకారంతో ఇంటింటా చెత్త సేకరణ, ప్రతీ ట్రాక్టర్‌కు లిఫ్టర్లు, ప్రతి జోన్‌కు ఇద్దరి నుంచి ముగ్గురు డ్రైన్ క్లీనర్లు ఉండేలా చూడడం, పనులు పూర్తయ్యాకే వాహనాల్లో డీజిల్ నింపడం, యంత్రాలను సమర్థవంతంగా వినియోగించడం ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.