Share News

peddapally : మున్సిపాలిటీల్లో స్పందన అంతంతే

ABN , Publish Date - May 11 , 2025 | 12:20 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లను ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం ఎర్లీ బర్డ్‌ స్కీం అమల్లోకి తీసుకొచ్చింది. అయితే జిల్లాలోని మునిసిపాలిటీలో అంతంత మాత్రంగానే స్పందన వచ్చింది.

 peddapally :  మున్సిపాలిటీల్లో స్పందన అంతంతే

- ఎర్లీ బర్డ్‌ పథకంపై స్పందించని ప్రజలు

- 5 శాతం రాయితీ కల్పించినా 30 శాతంలోపే వసూళ్లు

- ముందంజలో రామగుండం కార్పొరేషన్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లను ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం ఎర్లీ బర్డ్‌ స్కీం అమల్లోకి తీసుకొచ్చింది. అయితే జిల్లాలోని మునిసిపాలిటీలో అంతంత మాత్రంగానే స్పందన వచ్చింది. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్నాయి. ఎర్లీ బర్డ్‌ స్కీం ద్వారా పన్నులు చెల్లించే వారికి ప్రభుత్వం ఐదు శాతం రాయితీ కల్పించింది. అయితే ఈ పథకాన్ని రామగుండం కార్పొరేషన్‌ మినహా మిగతా మున్సిపాలిటీల్లో ప్రజలు పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు.

2025-26ఆర్థిక సంవత్సరానికిగాను ఆస్తి పన్నుల చెల్లింపులను ప్రోత్సహిం చేందుకు ఎర్లీ బర్డ్‌ స్కీంను ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏప్రిల్‌ నెలాఖరు వరకు గడువు విధించింది. స్పందన తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ నెల ఏడవ తేదీ వరకు గడువు పెంచింది. గడువు ముగిసే నాటికి పెద్దపల్లి మున్సిపాలిటీలో 12,451 గృహాలు, ఇతర పరిశ్రమల ద్వారా 8 కోట్ల రెండు లక్షల రూపాయల ఆస్తి పన్ను లక్ష్యం కాగా 2862 మంది (21.20) శాతం ఎర్లీ బర్డ్‌ స్కీంను సద్వినియోగం చేసుకొని కోటి 70 లక్షల రూపా యల ఆస్తి పన్ను చెల్లించి రాష్ట్రంలో 61వ స్థానంలో నిలిచారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 5511 గృహాలు, పరిశ్రమల ద్వారా ఆస్తి పన్ను మూడు కోట్ల 6 లక్షల లక్ష్యం కాగా, 1014 మంది 57 లక్షలు (18.63 శాతం) రూపాయలు చెల్లించి రాష్ట్రంలో 73వ స్థానంలో ఉన్నారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో 5203 గృహాలు, పరిశ్రమల ద్వారా రెండు కోట్ల 30 లక్షల ఆస్తి పన్ను లక్ష్యం కాగా, 1400 మంది 58 లక్షల (25.22 శాతం) రూపాయలు చెల్లించి రాష్ట్రంలో 43వ స్థానంలో ఉన్నారు.

ఫ ముందంజలో రామగుండం కార్పొరేషన్‌..

ఎర్లీ బర్డ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రామగుండం కార్పొరేషన్‌ ప్రజలు ముందంజలో నిలిచారు. ఈ కార్పొరేషన్‌లో 51,033 గృహాలు పరిశ్రమల ద్వారా 19 కోట్ల 14 లక్షల రూపాయల ఆస్తిపన్ను లక్ష్యం కాగా, పథకం గడువు ముగిసే నాటికి 13,915 మంది 9 కోట్ల 17 లక్షల రూపాయల ఆస్తి పన్ను చెల్లించి రాష్ట్రంలో కార్పొరేషన్లలో మొదటి స్థానంలో నిలిచారు. అధికారులు విస్తృత ప్రచారం కల్పించగా, పెద్దపల్లి సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో ఎర్లీ బర్డ్‌ స్కీంను ప్రజలు పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంబంధిత మున్సి పల్‌ అధికారులు కూడా పెద్దగా ప్రచారం చేసినట్లుగా కనబడలేదు. అయితే ఈ మూడు మున్సిపాలిటీలు గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండడంతో ఆస్తి పన్ను చెల్లింపుపై పెద్దగా అవగాహన లేకపోవడంతో మార్చి వరకైనా చెల్లించ వచ్చనే ధీమాతో ఉండడంతో ఎర్లీ బర్డ్‌ స్కీంను పెద్దగా సద్వినియోగం చేసుకున్నట్లుగా కనబడుతున్నది.

Updated Date - May 11 , 2025 | 12:20 AM