Share News

peddapally : మావోయిస్టు కీలక నేతల లొంగుబాటుకు చర్యలు

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:09 AM

కోల్‌సిటీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): అబుజ్‌మడ్‌ ప్రాంతాల్లో పని చేస్తున్న జిల్లాకు చెందిన మావోయిస్టు కీలకనేతలపై పోలీసులు దృష్టి పెట్టారు. వారిపై ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

peddapally :  మావోయిస్టు కీలక నేతల  లొంగుబాటుకు చర్యలు

- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన అధికారులకు బాధ్యతలు

- అనారోగ్యంతో బాధపడుతున్న కీలక నేతలు

- జిల్లాకు చెందిన 10మంది మావోయిస్టు నేతలు అజ్ఞాతంలో

- కేంద్ర కమిటీలోనే ముగ్గురు నాయకులు

కోల్‌సిటీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): అబుజ్‌మడ్‌ ప్రాంతాల్లో పని చేస్తున్న జిల్లాకు చెందిన మావోయిస్టు కీలకనేతలపై పోలీసులు దృష్టి పెట్టారు. వారిపై ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దండకారణ్యంలో కేంద్ర బలగాలు, కోబ్రా కమాండెంట్లు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో ముందడుగు వేస్తున్నారు. మావో యిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌తో చెల్లా చెదురుగా ఉన్న మావోయిస్టు నాయకత్వాన్ని ఆ పార్టీకి దూరం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వారిని తుదముట్టించడంతోపాటు లొంగుబాటుకు కార్యాచరణ రూపొందించుకుంటు న్నారు. ఇప్పటికే దండ కారణ్యం, ఆంధ్రా, ఒడిశా బార్డర్‌, అబుజ్‌మడ్‌లో స్థానిక నాయకత్వం, క్యాడర్‌ను లొంగు బాటుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయక త్వంపై దృష్టి పెట్టింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి ప్రాతిని ధ్యం వహిస్తున్నారు. స్థానికులకు చెందిన క్యాడర్‌ లొం గుబాటు పట్టడంతో సేఫ్టీ జోన్‌లోకి నాయకత్వం వెళ్లినట్టు తెలుస్తున్నది. దీంతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలా బాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన కీలక నాయకులు ఉన్నారు. ఇందులో ఒక పెద్దపెల్లి జిల్లాకు చెందిన నాయకులే పది మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు కాగా మిగతా వారు తెలంగాణ రాష్ట్ర కమిటీ, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీలకు బాధ్యతలు వహిస్తున్నారు.

జిల్లాలోని మంథని మండలం శాస్ర్తులపల్లికి చెందిన మల్లారాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇత నిపై రూ.25లక్షల రికార్డు ఉంది. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌రావుకు కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తు న్నారు. వడ్కాపూర్‌కు చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు స్టేట్‌ కమిటీ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర కమిటీకి సలహాదారుడిగా ఉన్నారు. ఈ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులపై రూ.25లక్షల రివార్డు ఉంది. వీరితో పాటు సబ్బితంకు చెందిన జంగిడి సత్యనారాయణరెడ్డి, కాల్వశ్రీ రాంపూర్‌ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. రామగుండంకు చెందిన అప్పాసి నారాయణ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇతనిపై రూ.5లక్షల రివార్డు ఉంది. పాలితంకు చెందిన ఆలేటి రామలచ్చులు దండకారణ్యంలో స్పెషల్‌ జోనల్‌ కమిటీలో కార్యదర్శి హోదాలో పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన దాతు ఐలయ్య ఏరియా కమిటీ బాధ్యుడిగా పని చేస్తున్నారు. జూలపల్లి మండలం వెంకట్రావ్‌పల్లికి చెందిన ఢీకొండ శంకరయ్య కమాండర్‌ స్థాయిలో పని చేస్తుండగా, సుల్తానాబాద్‌ మండలం కొదురుపాకకు చెందిన జువ్వాడి వెంకటేశ్వర్‌రావు ఏరియా కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నాడు. రాష్ట్ర కమిటీలో ప్రాతి నిధ్యం వహిస్తున్న వారు, దండకారణ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రస్తుతం దండకారణ్యంలోనే మకాం వేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఒక వైపు కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టు నేతలను అష్టదిగ్బంధం చేస్తుండగా మరో వైపు తెలంగాణ పోలీ సులు వారిని లొంగుబాట పట్టేందుకు తమ నెట్‌ వర్క్‌ను వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగా నక్సల్స్‌ ప్రభావిత ఠాణాల్లో పని చేసి ఆపరేషన్‌లలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా మంథని తూర్పు డివిజన్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, ములుగు ఏరియాల్లో పని చేసిన పోలీస్‌ అధికారులకు ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. మావోయిస్టు పార్టీ నాయక త్వానికి చెందిన బంధువులు, స్నేహితులతో పోలీసులు టచ్‌లోకి వెళుతున్నారు.

ఆపరేషన్‌లో భాగంగానే ఆత్రం లచ్చన్న దంపతుల లొంగుబాటు

మావోయిస్టులపై ద్విముఖ వ్యూహంతో ఉన్న ప్రభు త్వాలు మావోయిస్టుల నేతల లొంగుబాటుకు సంబం ధించి కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నుంచి బయటకు వచ్చే వారికి చికిత్స, పునరావాసం, ఉపాధి, రివార్డులు ఇవ్వడం, కేసుల పరి ష్కారం వంటి ఖచ్చితమైన హామీలు అమలు చేస్తు న్నారు. దీనిలో భాగంగానే ఉమ్మడి మంచిర్యాల జిల్లాకు చెందిన దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, అతని భార్య చౌదరి అంకు బాయిలు లొంగిపోయారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పోలీస్‌ అధికారులు ఇందులో కీలకంగా పని చేశారు. వీరి లొం గుబాటులో దండకారణ్యంలో మావోయిస్టు నాయకత్వం పరిస్థితిపై పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు ప్రభావిత పాంత్రాలకు చెందిన క్యాడర్‌, నాయకులు లొంగుబాటుతో అక్కడ పని చేస్తున్నా ఇతర ప్రాంతా లకు చెందిన నాయకత్వం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితులు ఉండడం, కనీసం అనారోగ్యంతో బాధప డుతున్న వారు చికిత్స చేసుకునే పరిస్థితులు కూడా లేనట్టు తెలుస్తున్నది. ఆత్రం లచ్చన్నపై కూడా పోలీ సులు ఇదే విధానాన్ని అవలంభించినట్టు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులు బయటకు వెళ్లాలనే పరిస్థితులు కల్పించినట్టు చర్చ జరుగుతుంది. పోలీసులకు లొంగిపోయిన లచ్చన్న దంపతులకు పోలీసులు అదే రోజు రూ.25లక్షల రివార్డు ఇచ్చారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లుతోపాటు ఉపాధికి సహ కారం అందించేలా చర్యలు చేపడుతున్నారు. అజ్ఞాతం వీడిన లచ్చన దంపతుల నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టుకున్నట్టు తెలుస్తున్నది.

నాలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసుల సమన్వయం

తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతల లొంగుబాటులో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ పోలీస్‌ యంత్రాంగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. ఏ నాయకులు ఎక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటనే విష యంపై ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి చేసు కుంటున్నారు. అనారోగ్యకర పరిస్థితులే ఆసరాగా వారిని లొంగుబాట పట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Updated Date - Jul 21 , 2025 | 12:09 AM