Share News

peddapally : తొలి విడత ప్రశాంతం

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:22 AM

(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి) జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్‌ సాఫీగా జరిగింది.

peddapally :  తొలి విడత ప్రశాంతం

ఫ 82.27 శాతం పోలింగ్‌

- అత్యధికంగా మంథనిలో 84.39 శాతం

- అత్యల్పంగా రామగిరిలో 77.96 శాతం

(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్‌ సాఫీగా జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఐదు మండలాల్లో 82.27 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అత్యధికంగా మంథని మండలంలో 84.39 శాతం, అత్యల్పంగా రామగిరి మండలంలో 77.96 శాతం నమో దైంది. కమాన్‌పూర్‌లో 83.59 శాతం, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 83.06 శాతం, ముత్తారం మండలంలో 82.27 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో ఓటర్లు తమ వార్డులకు వెళ్లి లైన్‌లో నిలబడి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్‌ ముగిసే ఒంగి గంట వరకు పోలింగ్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న వాళ్లు ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించారు.

కమాన్‌పూర్‌, ముత్తారం, కల్వచర్ల, గుంజపడుగు, కాల్వశ్రీరాంపూర్‌, గంగారం వంటి ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. మొదటి విడతలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో ఏకగ్రీవాలు పోనూ 94 గ్రామ పంచాయతీల్లో 685 వార్డు స్థానాలకు, 95 సర్పంచ్‌ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 95 సర్పంచ్‌ స్థానాలకు 376 మంది అభ్యర్థులు, 685 వార్డు స్థానాలకు 1880 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎన్నికల నిర్వహణ కోసం 1404 పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. ఈ విడతలో 305 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌తోపాటు పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద అభ్యర్థుల తరపున మద్దతుదారులు నిల్చొని తమ అభ్యర్థికి ఓటు వేయా లంటూ గుర్తులు చూపెడుతూ అభ్యర్థించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 19.19 శాతం పోలింగ్‌ నమోదు కాగా, 11 గంటల వరకు 52.42 శాతం, పోలింగ్‌ ముగిసే వరకు 82.27 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 9 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ఓటర్లు తమ పనులను పక్కన బెట్టి ఓటింగ్‌లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లు సైతం గ్రామాలకు వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా మద్యం పారించడంతో పాటు ఓటర్లకు నోట్లు కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆరంభం అయ్యింది. కమాన్‌పూర్‌, రామగిరి మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సందర్శించి పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా మంథని మండలం గుంజపడుగు, నాగారం, చిల్లపల్లి, తదితర పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి పోలీస్‌ బందోబస్తును పోలింగ్‌ సరళిని పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఫ మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలు..

----------------------------------------------------------

మెత్తం ఓట్లు పోలైన ఓట్లు

-------------------------------------------------------------------------------------------------------------------------

మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం శాతం

--------------------------------------------------------------------------------------------------------------------------

1. కాల్వశ్రీరాంపూర్‌ 17225 17595 01 34821 14514 14408 0 28922 83.06

2. కమాన్‌పూర్‌ 9875 10270 0 20145 8412 8427 0 16839 83.59

3. రామగిరి 15798 16033 01 31832 12340 12474 1 24815 77.96

4. మంథని 16479 17379 03 33861 14196 14378 1 28575 84.39

5. ముత్తారం 11328 11868 01 23197 9445 9750 0 19195 82.27

------------------------------------------------------------------------------------------------------------------------ మొత్తం 70705 73145 06 143856 58907 59437 2 118346 82.27

-------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 12 , 2025 | 02:22 AM