Share News

peddapally : యూరియా కోటా పెంపుపై స్పందించని కేంద్రం

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:54 AM

కోల్‌సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా కొరత ఏర్పడుతోంది. కేంద్ర ఎరు వులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను ముఖ్య మంత్రి కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి రాష్ట్రానికి కోటా పెంపుపై కేంద్రం నుంచి ఆదే శాలు రాలేదు.

peddapally :  యూరియా కోటా పెంపుపై   స్పందించని కేంద్రం

- కేంద్ర మంత్రిని కలిసి సీఎం వినతి

- అయినా ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రాని ఆదేశాలు

- పది రోజుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి 10వేల టన్నుల రవాణా

- పెద్దపల్లిలోనూ అరకొర నిల్వలే...

కోల్‌సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా కొరత ఏర్పడుతోంది. కేంద్ర ఎరు వులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను ముఖ్య మంత్రి కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి రాష్ట్రానికి కోటా పెంపుపై కేంద్రం నుంచి ఆదే శాలు రాలేదు. ఎరువుల కోటాను నిర్దేశించే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫెర్టిలైజర్స్‌(డీఓఎఫ్‌) ఈ మేరకు జారీ చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం జూలైలో 60వేల టన్నులు సరఫరా జరిగితే ఈ ఏడాది 30వేల టన్నులకు కుదిరించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో యూరియా వాడకం పెరిగింది. రైతాంగానికి యూరియా నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. జూలై మొదటి వారంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి యూరియా సరఫరా జరిగేది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 1.14లక్షల టన్నులు రవాణా చేశారు. ఈ ఏడాది ప్లాంట్‌ షట్‌డౌన్‌ కావడం తో రెండు నెలలు యూరియా సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఈనెల కోటా 30వేల టన్నులు నిర్దేశిం చగా పది రోజుల్లో 10వేల టన్నులు రవాణా చేశారు. అదనంగా 7వేల టన్నులు కృష్ణపట్నం నుంచి నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ కోటాలో రాష్ట్రానికి ఇచ్చారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి యుద్ధ ప్రాతిపదికన యూరియా సరఫరా చేసేం దుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఒక అధి కారిని లైజనింగ్‌ అధికారిగా నియమించింది. ప్లాంట్‌ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు యూరియా సరఫరా చేస్తున్నారు. ఒక్కో రేక్‌లో 2600 టన్నుల నుంచి 3వేల టన్నులు రవాణా జరుగుతుంది. నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి ప్రాంతాలకు యూరియా రవాణాకు రేకుల కొరత ఏర్పడుతుంది. ఒక్కో రేక్‌ లోడ్‌ అయ్యేందుకు 12గంటల సమయం తీసుకుంటుంది. కామారెడ్డి రైల్వే లైన్‌ సిం గిల్‌ లైన్‌ కావడంతో యూరియా సరఫరాను దృష్టిలో ఉంచుకుని ఇతర రవాణాను రైల్వేశాఖ కుదించుకుంది. అయినా రేకుల కొరత తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2.2లక్షల టన్నుల యూరియా మాత్రమే అం దుబాటులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో కమిషనర్‌ రిజర్వు పూల్‌ 50వేల టన్నులు ఉండగా దాన్ని కూడా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌, నిజా మాబాద్‌ జిల్లాల్లో సీఆర్‌పీ కోటా నుంచి యూరియా విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో యేటా జూలై నెలాఖరు తరువాత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి యూరియా సరఫరా జరిగేది. మూడు రోజుల క్రితం వరంగల్‌లో యూరియా కొరత తీవ్రం కావడం, రైతాంగం గొడవకు దిగడంతో ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ నుంచి అత్యవసరంగా ఒక రేక్‌ను వరంగల్‌కు పంపించారు.

ఫ జిల్లాలో నిల్వలు ఇలా...

పెద్దపల్లి జిల్లాలో సైతం యూరియా నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు. సాధారణంగా ఈ సీజన్‌లో 20వేల టన్నులు నిల్వ ఉండాల్సి ఉండగా 6వేల టన్ను లు మాత్రమే నిల్వ ఉన్నట్టు తెలుస్తున్నది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీరు చేరకపోవడంతో వరినాట్లు మొదలు కాలేదు. కేవలం వాణిజ్య పంటలకు మాత్రమే యూరియా డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వరినాట్లు మొదలైతే జిల్లాలో యూరి యా డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవ సాయశాఖ జిల్లాకు అవసరమైన యూరియాను అం దించలేదు. గతంలో కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో ఆర్‌ఎఫ్‌ సీఎల్‌ నుంచి నేరుగా కోటా విడుదల చేయించారు. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యూరియా ఉత్ప త్తి, రవాణాలను రోజు కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ మానిటర్‌ చేయడమే కాకుండా తమ ఆదేశాలు లేనిది ఎవరికి అదనపు కేటాయింపులు జరుపవద్దంటూ స్పష్ట మైన ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కూడా యూరియా ఇక్కట్లు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

15రోజుల్లో కోటా పెంచకపోతే ఇబ్బందే...

కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి 15రోజుల్లో కోటా పెంచి రాష్ట్రానికి సరఫరా చేయకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురుకానున్నాయి. పది రోజుల్లో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగా ణాల్లో వరినాట్లు మొదలై యూరియా డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి 60నుంచి 80వేల టన్నులు రాష్ట్రా నికి ఈ నెలాఖరు వరకు సరఫరా జరిగితేనే డిమాండ్‌ తట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఉమ్మడి ఆది లాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరాల్సిన పరిస్థితి ఉంది.

Updated Date - Jul 14 , 2025 | 12:55 AM