Share News

Peddapalli: యువత పోలీసులతో భాగస్వామ్యం కావాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:09 AM

కోల్‌సిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నేరనియంత్రణకు, సమాజాభి వృద్ధికి యువత పోలీసులతో భాగస్వామ్యం కావాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పిలుపునిచ్చారు.

 Peddapalli: యువత పోలీసులతో భాగస్వామ్యం కావాలి

రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

కోల్‌సిటీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నేరనియంత్రణకు, సమాజాభి వృద్ధికి యువత పోలీసులతో భాగస్వామ్యం కావాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పిలుపునిచ్చారు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం గోదావరిఖని వన్‌టౌన్‌సీఐ ఇంద్రసేనారెడ్డి, రామ గుండం సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మెగా రక్తదానశిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం అనేది అనేకమంది జీవితాలను కాపాడుతుందని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారిత్యాగాలను మరువలేమని అన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీస్‌శాఖ నిరంతరం పని చేస్తుందని చెప్పారు. రక్తదాన శిబిరంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐలు రమేష్‌, అనూష, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్‌ఐ వెంకట్‌, లయన్స్‌క్లబ్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 01:09 AM