Share News

Peddapalli: వ్యక్తులను చంపి విప్లవాన్ని ఆపలేరు

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:33 AM

పాలకుర్తి, నవం బరు 28 (ఆంధ్ర జ్యోతి): భూమి, బుక్తి, పేదప్రజల విముక్తి కోసం పోరా డుతున్న వ్యక్తులను చంపి విప్లవాన్ని ఆపలేరని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ అన్నా రు.

Peddapalli:   వ్యక్తులను చంపి విప్లవాన్ని ఆపలేరు

మధు సంస్మరణ సభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌

పాలకుర్తి, నవం బరు 28 (ఆంధ్ర జ్యోతి): భూమి, బుక్తి, పేదప్రజల విముక్తి కోసం పోరా డుతున్న వ్యక్తులను చంపి విప్లవాన్ని ఆపలేరని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ అన్నా రు. మండలం పరిధి లోని రాణాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఏగొలపు మల్లయ్య అలియాస్‌ మధు యాదిలో చల్పాక అమరుల సంస్మరణ సభను మల్లయ్య కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. విప్లవమార్గం వ్యక్తిపై ఆధారపడి ఉండదని, అది ఒక వ్యవస్థ అని అన్నారు. ఈ గ్రామ ముద్దుబిడ్డ ఏగోలపు మల్లయ్య అలియాస్‌ మధు తన ఆరుగురు సహచరులతో కలిసి బూటకపు ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసి నేటికి ఏడాది కావస్తోంద న్నారు. ఆపరేషన్‌ కగార్‌ను, ఆదివాసీలపై దాడులను నిలిపి, మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్నారు. మధు స్థూపంపై ఆయన సహచరి మీనా ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా గ్రామం విప్లవ నినాదాలతో, జననాట్య మండలి కళాకారుడు ఏట రవి బృందం ఆలపించిన విప్లవగేయాలతో మారుమోగింది.

కార్యక్రమంలో మల్లయ్యకుటుంబ సభ్యు లతోపాటు హుస్సేన్‌, పద్మకుమారి, కె సావిత్రీ దేవి, ఎరుకల రాజయ్య మాట్లాడారు. గుమ్మడి కొమురయ్య, బొంకూరి లక్ష్మయ్య, ముడి మడు గుల మల్లయ్య, బంధుమిత్రులు గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:33 AM