Peddapalli: ఉప్పు నీటితో ధాన్యం మొలకెత్తకుండా జాగ్రత్త పడవచ్చు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:13 AM
ఎలిగేడు/కమాన్‌పూర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వరి పొలంలోని నీటిని పూర్తిగా తొలగించి వాటిపై ఉప్పు నీటిద్రావణం పిచికారిచేస్తే మొలకెత్తకుండా ఉంటుందని మండల వ్యవసాయఅధికారులు ఉమాపతి, రామకృష్ణ తెలిపారు.
ఎలిగేడు/కమాన్‌పూర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వరి పొలంలోని నీటిని పూర్తిగా తొలగించి వాటిపై ఉప్పు నీటిద్రావణం పిచికారిచేస్తే మొలకెత్తకుండా ఉంటుందని మండల వ్యవసాయఅధికారులు ఉమాపతి, రామకృష్ణ తెలిపారు. గురువారం మండలాల్లో వర్షానికి నేలకొరిగిన వరిపంటలను రైతు లతోకలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం నీటిని పొలం నుంచి బయటకు పంపి, నీటిని లీటరు నీటికి 50గ్రాముల ఉప్పును కలిపి పిచికారి చేసుకుంటే వడ్లు మొలకె త్తకుండా ఉంటాయని వివరించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంపై కూడా ఉప్పుద్రావణాన్ని పిచికారిచేస్తే మొలకలు రాకపోవడంతో పాటు రంగు మారకుండా ఉంటుందన్నారు. ఆయనవెంట ఏఈవోలు గణేష్, సురేష్, శరణ్య, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.