Peddapalli: పల్లె పాఠశాలలో ప్రపంచస్థాయి విద్యా బోధన
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:41 AM
మంథని, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నాడు సమాజంలో అసమానతలు తొలగించడానికి సామాజిక విప్లవానికి అడుగులు పడ్డ ఆడవి శ్రీరాంపూర్ గ్రామంలో నేడు ప్రపంచ అత్యాధు నిక డిజిటల్ విద్యాబోధనకు శ్రీకారంచుట్టారు.
హైస్పీడ్ ఇంటర్నేట్‌తో ఏఐ సాఫ్ట్‌వేర్ వినియోగం..
టీఫైబర్ సాయంతో శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ బోధన
రాష్ట్రంలోనే ఏఐ టెక్నాలజీతో పాఠశాలలో నేడు ల్యాబ్ ప్రారంభం
విన్నూత విద్యాబోధనకు మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక కృషి
మంథని, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నాడు సమాజంలో అసమానతలు తొలగించడానికి సామాజిక విప్లవానికి అడుగులు పడ్డ ఆడవి శ్రీరాంపూర్ గ్రామంలో నేడు ప్రపంచ అత్యాధు నిక డిజిటల్ విద్యాబోధనకు శ్రీకారంచుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ, టీఫైబర్ సహకారంతో నేడు అడవి శ్రీరాంపూర్ గ్రామం ఇకనుంచి.. ప్రపంచా నికి ఐ..ఏఐ శ్రీరాంపూర్‌గా గురువారం ఆవిష్కృ తం అవుతుంది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషిమేరకు రాష్ట్రంలో తొలిసారిగా ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 8, 9, 10తరగతుల విద్యార్థులకు ఏఐ టెక్నాలజీతో విద్యాబోధన కొనసా గిస్తున్నారు. టీఫైబర్ ఆధ్వర్యంలో ఈ పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని గూగుల్‌సహకారంతో ఏఐ విధానంలో విద్యార్థులకు విద్యాబోధన, సందే హాల నివృత్తి చేసుకోవటానికి రాష్ట్రంలోనే మొట్ట మొదటి ఏఐ ల్యాబ్‌ను పాఠశాలలో నేడు మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే గ్రామం లో ఇంటింటికి టీఫైబర్ ఆధ్వర్యంలో హైస్పీడ్ ఇంటర్నెట్‌కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకువ చ్చారు. ఈపాఠశాలను ఏఐ విద్యావిధానంలో రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా ఉంచటానికి మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.