Share News

Peddapalli: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:20 AM

పెద్దపల్లి కల్చరల్‌/టౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళలు ప్రభుత్వం అందిం చే పథకాలను సద్వినియోగం చేసుకొని పారి శ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

Peddapalli: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి కల్చరల్‌/టౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళలు ప్రభుత్వం అందిం చే పథకాలను సద్వినియోగం చేసుకొని పారి శ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల అవ గాహన సమావేశం నిర్వహించారు. ఇందులో పలు ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. వీహబ్‌ ద్వారా కాలేజీల్లో చదువుతున్న బాలికలకు విద్య తర్వాత ఉపాధి అవకాశాలు పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీహబ్‌ రీజినల్‌ సెంటర్‌ను త్వరలో పెద్ద పల్లిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో రిజిస్టర్‌ చేసుకొని నూతన కోర్సులు నేర్చుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీం దర్‌, జిల్లాలోని మథర్‌ థెరిస్సా, ట్రినిటి, జేఎన్టీయూ, మంథని, తదితర కళాశాలలకు చెందిన విద్యార్థులు, స్వశక్తి సంఘాల మహి ళలు పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన

విద్యాబోధన అందించాలి..

పెద్దపల్లి కల్చరల్‌: విద్యార్థులకు మెరు గైన విద్యాబోధన అందించేలా చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలె క్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికా రులతో సమీక్ష చేశారు. ఎఫ్‌ఆర్‌ ఎస్‌ అటెండెన్స్‌ పక్కాగా నమోదు చేయాలని, ఉపా ధ్యాయులు 95 శాతం, విద్యార్థులు 85శాతం హాజరు తప్పకుండా ఉండాలన్నారు. ఉపాధ్యాయుల సెలవులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా హెచ్‌ఎం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని 85 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వతరగతిలో మెరుగైన ఫలి తాల సాధనకు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పరీక్షలకు సన్న ద్దం చేయాలన్నారు. అభ్యసన పద్ద తులను మెరుగు పరిచేందుకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో నెలరోజులపాటు మొదటి విడతలో 30పాఠశాలలను తనిఖీ చేయ డానికి నిర్ణయించినట్లు తెలిపారు. నిరంతరం ప్రతి పాఠశాలను మానిటరింగ్‌ చేయాలని, ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అన్నా రు. హెడ్‌మాస్టర్‌లతో కూడా సమీక్ష నిర్వ హించాలని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో డీఈవో శారద, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ప్రధానో పాధ్యా యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల మేరకు

నామినేషన్లు స్వీకరించాలి..

కమాన్‌పూర్‌: నిబంధనల మేరకు అభ్య ర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం ఆయన మండలంలోని ఎంపీడీవో కార్యా లయం, జడ్పీహెచ్‌ఎస్‌, ఐఈఆర్‌సి సెంటర్‌, గుండారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. జడ్పీ ఉన్నతపాఠశాల, ఐఈఆర్‌సీ సెంటర్‌లో అవసరమైన ఫర్నీ చర్‌కు ప్రతిపాదన సమర్పించాలని పేర్కొ న్నారు. ఆయన వెంట కమాన్‌పూర్‌ ఎంపీవో సౌమ్య, ఏపీఎం పద్మ, అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:20 AM