Peddapalli: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:05 AM
పెద్దపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.
- పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. బుధవారం పట్టణంలోని క్కాంపు కార్యా లయంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆయావార్డుల ఇందిరమ్మ కమిటీల సభ్యు లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజక వర్గానికి మొదటివిడతలో 3,500ఇళ్లు మంజూరు అయ్యాయని అన్నారు. ఒక్కోవార్డుకు 15వరకు ఇళ్లు కేటాయించే అవకాశాలున్నాయని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, మార్కెట్‌కమిటీచైర్మన్ ఈర్ల స్వరూప, మాజీకౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, ఉప్పు రాజు, తదితరులు పాల్గొన్నారు.