Peddapalli: మా గ్రామ బూడిద మాకే కావాలి
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:56 PM
అంతర్గాం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల పరిధిలోని ఎన్‌టీపీసీ భూనిర్వాసిత గ్రామం, ఎన్‌టీ పీసీ యాష్‌ప్లాంట్ నుంచి బూడిద లోడింగ్ కోసం పారి శ్రామిక ప్రాంతానికి చెందిన
అంతర్గాం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల పరిధిలోని ఎన్‌టీపీసీ భూనిర్వాసిత గ్రామం, ఎన్‌టీ పీసీ యాష్‌ప్లాంట్ నుంచి బూడిద లోడింగ్ కోసం పారి శ్రామిక ప్రాంతానికి చెందిన పెంచాల తిరుపతి అనేవ్యక్తి గ్రామస్తుల మధ్య చిచ్చుపెడు తున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగెనవేన శేఖర్ ఆరోపించారు. ఆదివారం కుంద నపల్లి గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తమబూడిద తమకే దక్కాలని డిమాండ్ చేశారు. బూడిద కారణంగా అనేక అవస్థలు పడుతున్నామని బూడిద లోడింగ్ పనులు కూడా తామే చేసుకుం టామని సమావేశం నిర్వహించి, మాట్లాడుకున్నారు. పదేళ్ల కాలంపాటు బీఆర్‌ఎస్ నాయకులతోకలిసి పెంచాల తిరుపతి బూడిద దందా కొనసాగించి కోట్లాది రూపాయలు సంపాదించాడని పేర్కొన్నారు. తాజాగా తమ గ్రామానికి చెందిన కొంతమంది బీఆర్ ఎస్ నాయకులను ముందుపెట్టి మళ్లీ బూడిద దందా కొనసాగించేందుకు తిరుపతి చేసిన ప్రయత్నాలను భూనిర్వాసిత గ్రామాలమైన తాము అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. గతంలో బూడిద దందా కొనసాగించిన బీఆర్‌ఎస్ నాయకులు గ్రామానికి చేసిం దేమీ లేదని విమర్శించారు. బయటివ్యక్తులు కుందన పల్లిలో ఇకనుంచి బూడిద దందాను కొనసాగిస్తామని వస్తే గ్రామస్తుల మంతా ఐక్యంగా అడ్డుకుంటా మన్నారు. గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు బయటి వ్యక్తులకు మద్దతు తెలపడం విరమించు కోవాలని హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బుర్ర వెంకట స్వామిగౌడ్, మేకల స్వామి, సుంకరి రవీందర్, నామాల శ్రీనివాస్, మల్లేశ్, సంగన వేన లక్ష్మి, నూనె సుజాత, దాసరి రాజమ్మ తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.