Peddapalli: నేరాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:35 AM
కోల్‌సిటీ, అక్టో బరు 15 (ఆంధ్ర జ్యోతి): నేర నియంత్రణలో పోలీసు అధి కారులు సమన్వ యంతో ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
నేర సమీక్ష సమావేశంలో సీపీ అంబర్ కిశోర్ ఝా
కోల్‌సిటీ, అక్టో బరు 15 (ఆంధ్ర జ్యోతి): నేర నియంత్రణలో పోలీసు అధి కారులు సమన్వ యంతో ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాలజోన్ పోలీస్‌అధికారులతో నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్‌స్టేషన్, డివిజన్, జోన్లవారీగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జిషీట్‌కు సంబంధించి ప్రస్తుతస్థితిగతులపై అడిగితెలుసుకున్నా రు. కమిషనరేట్ పరిధిలో నమోదు అయిన కేసుల పరిష్కారం కోసం భవి ష్యతులో ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ క్వాలిటీఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసుల పరిష్కార శాతం పెంచాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను, యూఐపీడీ కేసులను త్వరగా పరిష్కరించాలని, కేసుల దర్యాప్తులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు శాస్త్రీయ పద్దతిని అనుసరించి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం సైబర్‌క్రైమ్ పెద్దసమస్యగా మారిందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతప్రచారం చేయాలన్నారు. గంజా యి, డ్రగ్స్‌నియంత్రణకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసులు విధుల్లో అలసత్వం, ప్రదర్శిస్తే సహిం చేది లేదని, శాఖపరమైన కఠినచర్యలు తప్పవన్నారు. పోలీస్‌అధికారుల పనితీరుపైనే రామగుండం పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని అన్నారు.