Peddapalli: వణికిస్తున్న చలి..
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:45 PM
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చలి వణికిస్తోంది.
- 10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చలి వణికిస్తోంది. ఒకేసారి ఉష్ణోగ్రతలు 10డిగ్రీలకు పడిపోవడంతో జనం గజగజ వణుకుతున్నారు. నిన్న మొన్నటి వరకు 16డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్ర తలు అకస్మాత్తుగా 10డిగ్రీలకు పడిపోయాయి. సోమవారం గరిష్ణ 28.5, కనిష్ట 13.3డిగ్రీలు నమోదు కాగా మంగళవారం 29.2, 11.6, బుధ వారం 29.4, 12.6,గురువారం 28.8, 10.9డిగ్రీలు నమోదు కాగా శుక్రవారం కూడా 10డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఈదురుగాలులు వీస్తుండడంతో చలి ప్రభావం పెరిగిపోయింది. రాత్రి 7గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మాను ష్యంగా కనిపి స్తుండగా అత్య వసర సమ యాల్లో ఉన్ని దుస్తులు ధరించి జనం బయటకు వస్తున్నారు. తెల్లవారుజామున చలితీవ్రత అధికంగా ఉం టుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలు, పాలు తీసుకువచ్చే వ్యాపారులు చలి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులకు గురవు తుండగా సింగరేణి గనుల్లో రాత్రి షిప్టులో గైర్హా జర్ శాతం ఎక్కువగా ఉంటోంది. మూడు రోజు లుగా ఉష్ణోగ్రతలు 10డిగ్రీలకు పడిపోవడంతో ఉన్ని దుస్తుల వ్యాపారం ఊపందుకుంది. పలు కాలనీల్లో ప్రజలు చలిమంటలు వేసుకుని చలితీవ్రత నుంచి ఉపశమనం పొందు తుండగా రూమ్ హీటర్ల కొనుగోలుకు కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. డిసెంబర్‌లోనే చలిప్రభావం చూపుతుండగా జనవరి, ఫిబ్ర వరిలో చలి ఎలా ఉంటుందోనని జనం జంకుతున్నారు.