Peddapalli: కమ్ముకున్న పొగ మంచు..
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:19 AM
మంథని, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మంథని పట్టణంతోపాటు గ్రామాల్లో గురువారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది.
మంథని, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మంథని పట్టణంతోపాటు గ్రామాల్లో గురువారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో మంథని-కాటారం, మంథని-పెద్దపల్లి, మంథని-గోదావరిఖనికి వెళ్లే ప్రధాన రహదారిపై వాహనదారులు, గ్రామాల్లోని ప్రజలు ఈ ఆహ్లాదకర వాతా వరణాన్ని చూసి సంతోషం వ్యక్తంచేశారు. ఉదయం 7.30వరకు రోడ్లపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని నడిపారు. దాదాపు రెండు గంటలపాటు తెల్లని గాలితో నెమ్మదిగా కదిలిన పొగమంచును చూసి ప్రజలు తమ ఫోన్‌లతో ఫోటోలు, వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.