Share News

Peddapalli: ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:20 AM

మంథని, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వరిధాన్యం కొను గోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు.

 Peddapalli:  ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వరిధాన్యం కొను గోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. స్థానిక పోచమ్మవాడలో పీఏసీ ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో నూతనంగా నిర్మించిన సింథటిక్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును ఆయన ప్రారంభించారు. అనం తరం తెలంగాణ టీవర్క్స్‌ ఆధ్వ ర్యంలో విద్యార్థులకు బుక్స్‌ను బుధవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. తూకంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల న్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 48గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులలో ఆలోచన లను పదును పెట్టేందుకు డ్రీమ్‌, స్టార్ట్‌, రైస్‌ సంస్థ కృషి చేస్తుందన్నారు. మంథనిలో యువకులు వ్యవ సాయ పవర్‌ ఫీడర్‌, ఆధునిక హెల్మెట్‌ తయారీ ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. నూతన అవిష్కరణను ప్రోత్స హించేందుకు మంథనిలో టీవర్క్స్‌ ఆధ్వర్యంలో డ్రీమ్‌.స్టార్ట్‌.రైస్‌ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 20పాఠశాలల్లో ఈసంస్థ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వీటిలో ఆసక్తిగా పాల్గొంటున్న విద్యార్థులకు హైదారాబాద్‌ లోని టీవర్క్స్‌ సందర్శనకు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, టీవర్క్స్‌ సీఈవో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, ఆర్‌డీవో సురేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్లు కుడుదుల వెంకన్న, వైనాలరాజు, కాంగ్రెస్‌నేతలు శశిభూషణ్‌ కాచే, ఐలి ప్రసాద్‌, సెగ్గెం రాజేష్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

రామగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. బుధవారం రాత్రి బేగంపేట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం పాఠశా లల్లో అభివృద్దికిపనులకు సంబంధించిన శిలాఫల కాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:20 AM