Share News

Peddapalli: జాతిని జాగృతం చేసిన గీతం.. వందేమాతరం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:16 AM

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో జాతిని జాగృతం చేసిందని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Peddapalli:  జాతిని జాగృతం చేసిన గీతం.. వందేమాతరం

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో జాతిని జాగృతం చేసిందని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ స్పష్టం చేశారు. వందేమాతరం ఆలపించి 150యేళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులతో గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి హాజరై మాట్లాడారు. 1875లో బంకించంద్ర ఛటర్జీ వందేమాతర గీతాన్ని రచించారని తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి హృదయ స్పందనగా, ప్రజలను ఐక్యంగా నిలబెట్టిన శక్తివంతమైన జాతీయ నినాదంగా ఈ గీతం నిలిచిందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమర యోధుల యుద్ధ నినాదమైపోయిందని గుర్తుచేశారు. కార్యక్ర మంలో నాయకులు నల్లా మనోహరరెడ్డి, శిలారపు పర్వతాలు, సోమారపు లావణ్య, కోమల్ల మహేష్‌ తంగేడ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:16 AM