Peddapalli: రామగుండం ప్రజలు మార్పును చూస్తున్నారు
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:03 AM
కోల్‌సిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రామ గుండంలో ప్రజలు తాము కోరుకున్న మార్పును, అభి వృద్ధిని చూస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.
ప్రధాన ప్రాంతాల్లో హైమాస్ వెలుగులు
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
కోల్‌సిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రామ గుండంలో ప్రజలు తాము కోరుకున్న మార్పును, అభి వృద్ధిని చూస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి రూ.1.25కోట్లతో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో 25చోట్ల హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం రాత్రి గోదావరిఖని పట్టణంలోని రమేష్‌నగర్, తిలక్ నగర్, ఫైవింక్లయిన్ చౌరస్తాలు, రాఘవరావు సొసైటీ, సప్తగిరికాలనీ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హైమాస్‌లైట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండంలో చాలా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గుర య్యాయన్నారు. ప్రతి కుటుంబాన్ని, ప్రతివాడను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, రామగుండం కమిషనర్ అరుణశ్రీ, ఈఈ రామన్, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాకూర్, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, రాజిరెడ్డి, పెద్దెల్లి ప్రకాష్, ముస్తాఫా, గట్ల రమేష్, పెద్దెల్లి తేజస్విని, గడ్డం శ్రీనివాస్, దూళికట్ట సతీష్, ఉదయ్‌రాజ్ పాల్గొన్నారు.
ఉచిత మెగా వైద్యశిబిరానికి
విశేష స్పందన
పాలకుర్తి: మండలం పరిధిలోని బసంత్‌నగర్ అలా్ట్రటెక్ సిమెంటు కంపెనీ వర్కర్స్ క్లబ్‌లో గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్,మక్కాన్ సింగ్ సేవాసమితి చైర్‌పర్సన్ మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజలు ఈ ఉచిత వైద్యశిబిర సేవలను పెద్దఎత్తున వినియోగించుకున్నా రు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌గౌడ్, మాజీఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్, కన్నాల పీఏసీఎస్ చైర్మెన్ బయ్యపు మనోహర్ రెడ్డి, పర్షవేణి శ్రీనివాస్ యాదవ్,పాత రవిందర్, డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య,వాసు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.